Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రారంభంలో కాస్త బోరింగ్ గా అనిపించినా.. ఇప్పుడు కంటెస్టెంట్లు చేసే హడావిడీ, గొడవల వల్ల రసవత్తరంగా సాగుతుంది ఈ సీజన్. రెండవ, 4వ సీజన్ ఆడియన్స్ ను ఏ రేంజ్ లో ఆకట్టుకుందో.. ఇప్పుడు అదే రేంజ్ లో 7వ సీజన్ ఉందనే టాక్ ను సంపాదించింది. ఈ సీజన్ లో టాప్ 5లో ఎవరు ఉంటారనే టెన్షన్ ఇప్పటి నుంచే మొదలైంది. ఇక వీకెండ్ వస్తే ఎవరు ఎలిమినేట్ అవుతారనే టెన్షన్ కూడా ఉంటుంది. ఎవరు ఎలిమినేట్ అయినా ఆడియన్స్ కూడా ఎక్కువగా బాధ పడుతుంటారు. మరి ఈ వారం ఎలిమినేట్ అయేది ఎవరో తెలుసా?
బిగ్ బాస్ కి కక్ష కట్టినట్టు ఇంట్లో నుంచి మమిళలనే పంపిస్తున్నాడు. మొదటి వారం నుంచి టాస్కుల్లో దుమ్ములేపుతూ వచ్చిన సందీప్ గత వారం ఎలిమినేట్ అవడంతో మహిళలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ వారం ఎలిమినేషన్ ఎలా ఉండబోతుందనే ఆత్రుత మొదలైంది. సోషల్ మీడియాలో అందరికంటే తక్కువ ఓటింగ్ సంపాదించింది శోభా శెట్టి. ఆమె ఈ వారం బయటకు వెళ్లడం పక్కా అనుకున్నారు. కానీ లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ వారం కూడా శోభా సేఫ్ అని టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే ఆమె బిగ్ బాస్ హౌజ్ లో అడుగుపెట్టే కంటే ముందే ఓటింగ్ తో సంబంధం లేకుండా 10 వారాల పాటు ఇంట్లో ఉండేలా అగ్రిమెంట్ రాయించుకుందట శోభా.
ఈ రూమర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అందుకే ఆమె ఈ వారం కూడా సేఫ్ అయ్యే అవకాశం ఉంది. అంతే కాదు ఈమె ఇంటికి కెప్టెన్ కూడా. పదవ వారం నామినేషన్స్ నుంచి తప్పించుకుంది ఈ బ్యూటీ. అలా ఆమె టాప్ 5లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం కూడా ఉందనే టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ వారం ఓటింగ్ తక్కువ వచ్చిన కంటెస్టెంట్స్ లో రతిక, ప్రియాంక, తేజా ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురికి దాదాపుగా ఒకే రేంజ్ లో ఓట్లు ఉన్నాయి. కానీ రతిక మాత్రం కాస్త దూరంలో ఉంది. శివాజీ బ్యాచ్ తో స్నేహం చేయడం వల్ల ఆయన ఫ్యాన్స్ రతికకు ఓట్లు వేస్తున్నారు అనే టాక్ కూడా ఉంది. అయితే ప్రియాంక, తేజా ప్రస్తుతానికి డేంజర్ జోన్ లో ఉన్నారు. దీంతో వీళ్లిద్దరు డేంజర్ జోన్ లో ఉన్నట్టే.. ఒకవేళ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగితే ఇద్దరు కూడా ఇంటి నుంచి వెళ్లిపోవడం పక్కా అంటున్నారు. మరి నిజం ఏంటో తెలియాలంటే కాసేపు ఆగాల్సిందే..