
శివాత్మిక రాజశేఖర్ మంచి నటి అని ఇండస్ట్రీలో పాజిటివ్ టాక్ ఉంది. పైగా దొరసాని సినిమాలో తన నటనతో బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం చేస్తోన్న ‘పంచతంత్రం’ సినిమాలో కూడా శివాత్మిక నటన అద్భుతంగా ఉంటుందట. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే తమిళ దర్శకుడు బాల శివాత్మిక నటన చూసి.. తమిళంలో తెరకెక్కుతున్న ‘ఆనందం విలయదుం వీడు’ అనే సినిమాలో ఆమెనే హీరోయిన్ గా రికమండ్ చేశాడు. .
పక్క భాష వాళ్లే శివాత్మిక నటన చూసి ఆమెను తమ సినిమాల్లో పెట్టుకుంటుంటే.. తెలుగు సినిమా మేకర్స్ మాత్రం ఆమెను తమ సినిమా నుంచి తప్పిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ‘కప్పెల’ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. యంగ్ హీరో సిద్దు జోన్నల గడ్డ, అలాగే తమిళ ఆర్టిస్ట్ అర్జున్ దాస్ కీలక పాత్రలో ఈ సినిమా వస్తోంది.
కాగా మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా శివాత్మికను తీసుకున్నారు. ఆమె కూడా ఓ సందర్భంలో ఈ సినిమాలో నటిస్తున్నట్లు కూడా ఇన్ డైరెక్ట్ గా చెప్పారు. అయితే, తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా మలయాళ హీరోయిన్ ‘అనికా సురేంద్రన్’ను మేకర్స్ ఫైనల్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాని డెబ్యూ డైరెక్టర్ చంద్రశేఖర్ టీ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు.
మరి చంద్రశేఖర్ టీ రమేశ్, కావాలని శివాత్మికను తప్పించి.. ‘అనికా సురేంద్రన్’ను తీసుకున్నాడా ? లేక, వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా ?. ఒక విధంగా శివాత్మికకు గోల్డెన్ చాన్స్ మిస్ అయినట్టే. ఎందుకంటే.. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా కీలకమైంది. హీరోయిన్ చుట్టూనే సినిమా కథ మొత్తం సాగుతుంది. ఇక శివాత్మిక, కృష్ణవంశీ ‘రంగ మార్తాండ’లో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.