Shivani Rajasekhar Marriage: చిత్ర పరిశ్రమలో వారసత్వం వెరీ కామన్. హీరోలు, హీరోయిన్స్, దర్శకులు, నిర్మాతల పిల్లలు పరిశ్రమలో రాణించాలని ఆశపడతారు. టాలీవుడ్ లో హీరోల కూతుళ్లను హీరోయిన్స్ చేసే సంప్రదాయం లేదు. ఈ మధ్య ఈ రూల్ కొందరు బ్రేక్ చేస్తున్నారు. నాగబాబు కూతురు నిహారిక, రాజశేఖర్ ఇద్దరు కూతుళ్లు శివానీ, శివాత్మిక హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చారు. శివానీ అయితే మంచి హీరోయిన్ రోల్స్, హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో మెరుస్తోంది.

ప్రముఖ యువ హీరో రాజ్ తరుణ్ తొలిసారిగా నటించిన ‘అహా నా పెళ్లంట’ వెబ్ సిరీస్ లోనూ హీరో రాజశేఖర్ కుమార్తె శివాని రాజశేఖర్ హీరోయిన్ గా నటించింది.. పెళ్లయ్యే వరుకు ఏ అమ్మాయితో కూడా ప్రేమలో పడను అని తల్లికి మాట ఇచ్చిన యువకుడు ఒక అమ్మాయి ప్రేమలో పడుతాడు..మరి అమ్మాయి తల్లి చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా..లేక ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా అనేది స్టోరీ..జీ 5 యాప్ లో ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం స్ట్రీమింగ్ అయ్యింది.
ఈ వెబ్ సిరీస్ చిత్రీకరణలోనే శివానీ హీరో రాజ్ తరుణ్ తో ప్రేమలో పడిందని.. వీరిద్దరి పెళ్లికి ఇరువురు కుటుంబ సభ్యులు కూడా అంగీకరించినట్టు సోసల్ మీడియా ప్రచారం సాగుతోంది. ఈ వార్త వైరల్ కావడంతో శివానీ వరకూ కూడా చేరింది.

పెళ్లి వార్తలపై శివానీ క్లారిటీ ఇచ్చింది. ‘రాజ్ తరుణ్ తో వెబ్ సిరీస్ చేశాను. అతడో మంచి నటుడు. తనకు మంచి ఫ్రెండ్ అంతే. అతడితో పెళ్లి చేసుకుంటే ప్రపంచ యుద్ధాలు జరుగుతాయి. తమ మధ్య పెళ్లి చేసుకునేంత ఏమీ లేదు’ అని సరదాగా సమాధానమిచ్చింది శివానీ. తమ మధ్య స్నేహం తప్ప ప్రేమ లేదని కుండబద్దలు కొట్టింది. దీంతో ఇప్పటికైనా ఈ వార్తలకు చెక్ పడుతుందో లేదో చూడాలి.



