Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ వీక్ కావడంతో ముందుగా శివాజీ పెద్ద కొడుకు కెన్నీ హౌస్ లో కి అడుగు పెట్టాడు. ఇక శివాజీ ని ఒక సారి మెడికల్ రూమ్ కి రండి అని బిగ్ బాస్ పిలిచారు. దీంతో శివాజీ లోపలికి వెళ్ళాడు. అక్కడ డాక్టర్ వేషంలో ఉన్న శివాజీ కొడుకు చెయ్యి ఎలా ఉంది. ఎక్సర్సైజ్ చేస్తున్నారా,బాగా పడుకుంటున్నారా అని అడిగాడు. దానికి శివాజీ బానే ఉంది అని సమాధానం చెప్పాడు. ఓకే రెండు మూడు రోజుల్లో ఈ పెయిన్ తగ్గిపోతుంది అని డాక్టర్ చెప్పాడు. థాంక్యూ సార్ అని శివాజీ వెళ్లబోయాడు. ఇంతలో నాన్న అంటూ పిలవడంతో శివాజీ షాక్ అయ్యాడు.
డాక్టర్ వేషంలో వచ్చింది తన పెద్ద కొడుకు కెన్నీ అని తెలుసుకుని శివాజీ చాలా భావోద్వేగానికి గురైయ్యాడు. అతడిని గుండెలకి హత్తుకుని భోరున ఏడ్చాడు. తర్వాత రూమ్ నుండి బయటకు తీసుకొచ్చి నా కొడుకు కెన్నీ అంటూ గర్వంగా అందరికీ పరిచయం చేశాడు. తర్వాత శివాజీ తన కొడుకుతో కూర్చుని కాసేపు మాట్లాడారు. నువ్వు వస్తావ్ అనుకోలేదు .. తమ్ముడు వస్తాడు అనుకున్న అని శివాజీ అన్నాడు. నువ్వు వచ్చే ముందు మళ్ళీ కలవడానికి ఛాన్స్ ఉంటుందో లేదో అని నేనే వచ్చాను అని కెన్నీ చెప్పాడు.
దాంతో శివాజీ ఎమోషనల్ అయ్యాడు. ఏడవద్దు .. మీరు ఏడుస్తే అందరూ ఏడుస్తారు ఇంట్లో .. నువ్వు నవ్వితే అందరూ నవ్వుతారు అని కెన్నీ చెప్పాడు. ఆ తర్వాత ప్రశాంత్ రావడంతో థాంక్స్ అన్న .. నాన్నని బాగా చూసుకున్నారు అన్నాడు. యావర్ అన్న ఇంకా అలిగాడా అని శివాజీ తో అనగానే లేదు మాట్లాడుతున్నాడు అని చెప్పాడు.
యావర్ రాగానే ‘నాన్న చేతికి దెబ్బ తగిలినప్పుడు బాగా చూసుకున్నారు థాంక్స్ అన్నా అని యావర్ కి చెప్పాడు కెన్నీ. శివాజీ తో మాట్లాడుతూ ఒకటేంటంటే హౌస్ లో అందరిని నమ్మకు ప్రశాంత్,యావర్ గురించి కాదు. వాళ్ళు రెచ్చగొట్టాలని చూసినా రెచ్చిపోకు అని చెప్పాడు. శివాజీ తో మాట్లాడుతున్నప్పుడు కెన్నీ ఏవేవో సైగలు చేసాడు. కొడుకు తొడలపై శివాజీ ఏదో రాసినట్టుగా .. దానికి కెన్నీ ఏదో హింట్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొందరైతే విన్నర్ నువ్వే అని హింట్ ఇచ్చాడని అంటున్నారు.