Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్లో ఏదైనా జరగొచ్చు అంటారు. ఒక్క సంఘటన ప్రేక్షకుల్లో ఓ కంటెస్టెంట్ పట్ల ఉన్న అభిప్రాయం మార్చేయవచ్చు. శివాజీ విషయంలో అదే జరిగిందన్న వాదన వినిపిస్తోంది. అమర్ దీప్ విషయంలో శివాజీ ప్రవర్తించిన తీరు అతని ఇమేజ్ భారీగా డ్యామేజ్ చేసిందనే వాదన వినిపిస్తోంది. బిగ్ బాస్ సీజన్ 7కి గాను చివరి కెప్టెన్సీ టాస్క్ శుక్రవారం ఎపిసోడ్లో నడిచింది. ఎవరు కెప్టెన్ కావాలనే నిర్ణయం హౌస్ మేట్స్ కి వదిలేశాడు బిగ్ బాస్.
గోడ మీద ఇద్దరు కంటెస్టెంట్స్ ఫోటోలు ఉంటాయి. మరో ఇద్దరు కంటెస్టెంట్స్ వచ్చి వారిద్దరిలో ఎవరికి కెప్టెన్ అయ్యే అర్హత ఉందో? ఎవరికి లేదో? నిర్ణయించాలి. వారిద్దరూ ఏకాభిప్రాయానికి రావాల్సి ఉంటుంది. ఈ టాస్క్ లో చివరికి అమర్-అర్జున్ మిగిలారు. వీరిలో ఎవరు కెప్టెన్ కావాలి-ఎవరు తప్పుకోవాలనే నిర్ణయం… శోభ-శివాజీలకు వచ్చింది. గతంలో శోభ కెప్టెన్ కావడానికి అమర్ సహకరించాడు. ఆమెకు బదులు ఓ టాస్క్ ఆడి గెలిచి కెప్టెన్ చేశాడు.
దీంతో అమర్ ని కెప్టెన్ చేస్తాను అని శోభ గతంలోనే మాట ఇచ్చింది. దానికి కట్టుబడి అమర్ కెప్టెన్ కావాలని ఆమె అన్నారు. అయితే అర్జున్ భార్యకు నేను కూడా మాటిచ్చాను. అతన్ని రెండోసారి కెప్టెన్ చేస్తానని శివాజీ కూడా పట్టుబట్టాడు. ఇద్దరి మధ్య పంచాయితీ తెగలేదు. అయితే అమర్ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి. శివాజీని అమర్ వేడుకున్నాడు. కన్నీరు పెట్టుకున్నాడు. ఎంత ప్రాధేయపడినా అమర్ కెప్టెన్ అయ్యేందుకు శివాజీ ఒప్పుకోలేదు.
అమర్ దీప్ విషయంలో శివాజీ వ్యవహరించిన తీరు ప్రేక్షకులకు కూడా నచ్చలేదు. అమర్ దీప్ అంటే శివాజీకి ఎంత ద్వేషమో ఈ సంఘటనతో బయట పడిందన్న చర్చ జరుగుతుంది. అలాగే మొదటి నుండి శివాజీ వర్సెస్ అమర్ అన్నట్లు వ్యవహారం ఉంది. టైం చూసి అమర్ ని శివాజీ దెబ్బకొట్టినట్లు అయ్యింది. మొత్తంగా టైటిల్ రేసులో ఉన్న శివాజీ ఒక్కసారిగా క్రిందకు పడిపోయాడని, అదే సమయంలో అమర్ గ్రాఫ్ బీభత్సంగా పెరిగింది అంటున్నారు. ఇది అమర్, పల్లవి ప్రశాంత్ లకు ప్లస్ కావచ్చు.