Shivaji: బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ వివాదంలో చిక్కుకుని జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. విన్నర్ అయ్యాడే కానీ .. ఆ సంతోషం ఒక్క రోజు కూడా లేకుండా పోయింది. లా అండ్ ఆర్డర్ అతిక్రమించినందుకు .. అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. పోలీసులు, బిగ్ బాస్ నిర్వాహకులు ముందు గేట్ నుంచి వెళ్ళద్దు అని పల్లవి ప్రశాంత్ కి చెప్పారు.బయట గొడవలు జరుగుతున్నాయి నువ్వు కనుక ఇప్పుడు వెళ్తే వాళ్ళు రెచ్చిపోతారని వివరించారు.
ఇప్పటికే నాలుగైదు బస్సులను ధ్వంసం చేశారు .. మీ తోటి కంటెస్టెంట్ల కార్లు కూడా పగలగొట్టారు అని చెప్పారు. కానీ ప్రశాంత్ ‘ నేను రైతు బిడ్డని .. నేనేమైనా దొంగతనం చేశానా .. దొరలా ముందు గేట్ నుంచి పోతా అంటూ తొడ కొట్టాడు. లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది. ప్రశాంత్ కోసం వచ్చిన అభిమానులు ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారు.రోడ్డున పోయే వాళ్ళపై కూడా రాళ్లు రువ్వారు.
కాగా నిన్ను వెనుక నుంచి వెళ్ళమంటే .. ముందు గేట్ నుంచి ఎందుకు వచ్చావు అని పోలీసులు ప్రశ్నించారు. అయితే ‘ అన్న నేను రైతు బిడ్డని .. రైతు బిడ్డని తొక్కేస్తారా అంటూ సింపతీ ప్లే చేసాడు. వెనుక ఉన్న వందలాది మంది జనాన్ని చూసి పోలీసులను ప్రశాంత్ లెక్క చేయలేదు. దీంతో వాళ్ళు చేయాల్సిన పని చేశారు. ప్రశాంత్ పై క్రిమినల్ కేసు పెట్టారు. ఇక ప్రశాంత్ తో పాటు అతని తమ్ముడి అరెస్ట్ చేశారు. జడ్జి రిమాండ్ విధించడంతో చంచల్ గూడ జైల్లో వేశారు. దీంతో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ పై ఓ రేంజ్ లో ట్రోలింగ్ నడుస్తుంది.
శిష్యుడు మంచి పని చేస్తే గురువును పొగుడుతారు .. అదే శిష్యుడు వెధవ పని చేస్తే గురువుని కూడా తిడతారు. ప్రశాంత్ చేసిన పనికి శివాజీని కూడా ట్రోల్ చేస్తున్నారు. పాత వీడియోలు షేర్ చేస్తూ ఇద్దర్ని ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. బిగ్ బాస్ జైల్లో ఉన్నపుడు శివాజీ కటకటాల్లో నుంచి దూరి వస్తున్న ఫోటో షేర్ చేస్తూ .. ‘ మన నక్కాజీ ప్రశాంత్ కి జైలు నుంచి ఎలా తప్పించు కోవలో ట్రైనింగ్ ఇస్తున్నాడు ‘ అంటూ ట్రోల్ల్స్ .. మీమ్స్ సోషల్ మీడియాలో వదులుతున్నారు.