Salaar: సలార్ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ప్రభాస్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ చిత్రం డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ విడుదల చేశారు. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్, మూవీ లవర్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. సలార్ పై అంచనాలు భారీగా ఉన్న నేపథ్యంలో ఓపెనింగ్ వసూళ్లు కుమ్మింది. అడ్వాన్స్ బుకింగ్ లో సత్తా చాటింది. సలార్ మూవీ టికెట్స్ కోసం జనాలు ఎగబడ్డారు. టికెట్స్ కోసం క్యూలు కట్టారు.
డిసెంబర్ 21 అర్థరాత్రి నుండే ప్రీమియర్స్ ప్రదర్శన జరిగింది. సలార్ మూవీలో యాక్షన్ ఎపిసోడ్స్ అదిరిపోయాయి. ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ మెప్పించాయి. ప్రభాస్ మాస్ కట్ అవుట్ కి ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్ అబ్బురపరిచాయి. అయితే కథ ఎమోషనల్ కనెక్ట్ కాలేదనే వాదన వినిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం ఉంది. పార్ట్ 2 కోసం చాలా విషయాలు సశేషం గా వదిలేశారు. పార్ట్ 2 కోసం కథ దాచేశారు. అసలు మేటర్ అంతా సలార్ 2లో ఉందని అంటున్నారు.
ఫస్ట్ హాఫ్ లో మెకానిక్ గా కనిపించిన ప్రభాస్… సెకండ్ హాఫ్ లో మిత్రుడు కోసం యుద్ధం చేసే సైనికుడిలా కనిపించాడు. ఇక క్లైమాక్స్ లో పార్ట్ 2 కి శౌర్యంగ పర్వం అని లీడ్ ఇచ్చారు. అసలు శౌర్యంగ పర్వం అంటే ఏమిటనేది? ఒక ప్రశ్న? శృతి హాసన్ ఎవరు? ఆమెను ప్రభాస్ ఎందుకు రక్షిస్తున్నాడు? అనేది మరో ప్రశ్న. ఈశ్వరి రావు ప్రభాస్ ని ఎందుకు కట్టడి చేస్తుంది?
ప్రాణ మిత్రులు పృథ్విరాజ్, ప్రభాస్ బద్ద శత్రువులు ఎందుకు అయ్యారు? అసలు ఖాన్సార్ పై ఆధిపత్యం ఎవరిది? ఇలా అనేక ప్రశ్నలకు ప్రశాంత్ నీల్ సమాధానం చెప్పాల్సి ఉంది. సలార్ తో పాటు పార్ట్ 2 షూటింగ్ కూడా చాలా వరకు కంప్లీట్ అయ్యిందట. పార్ట్ 2తో పిక్చర్ క్లారిటీ రావాల్సి ఉంది. ప్రభాస్ కల్కి, రాజా డీలక్స్ చిత్రాల షూటింగ్స్ లో బిజీగా ఉన్నాడు. పార్ట్ 2 ఎప్పుడు విడుదల అవుతుందో చూడాలి..