Shivaji: బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొన్న శివాజీ మరోసారి వెలుగులోకి వచ్చాడు. హౌస్ లో రెండో బిగ్ బాస్ లా చక్రం తిప్పిన శివాజీ టైటిల్ ఫేవరేట్ గా నిలిచాడు. ఫినాలేకు చేరుకొని మూడో స్థానం సొంతం చేసుకున్నాడు. ఈ షో ద్వారా ఫుల్ క్రేజ్ సంపాదించిన శివాజీ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో తాజా ఇంటర్వ్యూలో శోభా శెట్టి పై శివాజీ సంచలన కామెంట్స్ చేశాడు. ఆమె పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మొదటి నుంచి సీరియల్ బ్యాచ్ వర్సెస్ స్పై బ్యాచ్ మధ్య గొడవలు జరుగుతూనే వచ్చాయి. చివరి వారాల్లో వీరి మధ్య వైరం ఇంకాస్త ముదిరింది. ముఖ్యంగా ఒక టాస్క్ లో శోభా – శివాజీ లకు హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది. శోభా శెట్టి… శివాజీని వెటకారం చేసి మాట్లాడింది. దీంతో శివాజీ కూడా గట్టిగానే ఫైర్ అయ్యారు. కన్ఫెషన్ రూంలో నాగార్జునతో శివాజీ పై శోభా శెట్టి చేసిన ఆరోపణల మీద శివాజీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఫైర్ అయ్యాడు.
శివాజీ… నన్ను , ప్రియాంకను కన్నడ అమ్మాయిలు అంటున్నారు. భాషా బేధం చూపిస్తున్నారు అని ఆరోపణలు చేసింది. శోభా చేసిన ఆరోపణలపై స్పందిస్తూ .. నాతో గొడవ పెట్టుకుంటే కొంత అటెన్షన్ వస్తుంది. ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు మెచ్యురిటీ లేకుండా మాట్లాడుతుంది. తెలుగు ఆడియన్స్ శోభా శెట్టిని ఎంకరేజ్ చేశారంటే ఆమె నటన బాగుంది. తెలుగువాళ్లు భాషాబేధం చూడరు. టాలెంట్ ఉంటే ఎవరైనా ఆదరిస్తారు.
నేను కన్నడ అమ్మాయిని అని ఎందుకు నీకు నువ్వే గెలుక్కుంటావ్. అలా చెప్పుకోవడం చాలా చీప్ గా ఉంది. ఇలాంటి పనులు ఎప్పుడూ చేయకు. నా విషయంలో చాలా ఓవర్ యాక్షన్ చేసింది. మొదట్లో నాతో బానే ఉంది. తర్వాత ట్రూ కలర్స్ బయట పడ్డాయి. జీవితంలో ఎదగాలంటే ఓర్పు సహనం కావాలి. బిగ్ బాస్ షో మనల్ని మనం మార్చుకోవడానికి ఒక ఛాన్స్ ఇచ్చింది. అయినా నేను ఎవరినీ .. ఒకరిని బ్యాడ్ చేయడానికి. నేను కాదు అంటే ప్రపంచం వెలివేస్తుందా . ఇకనైనా బుద్ది మార్చుకో. ఇలా మాట్లాడవద్దు అంటూ శివాజీ ఫైర్ అయ్యాడు.