Bigg Boss 7 Telugu: శివాజీ సీనియర్ నటుల్లో ఒకరు. రవితేజ, బ్రహ్మజీ లతో పాటు పరిశ్రమలో జర్నీ స్టార్ట్ చేశాడు. మొదట్లో సపోర్టింగ్, నెగిటివ్ రోల్స్ చేశాడు. అనంతరం హీరోగా ఎదిగాడు. మిస్సమ్మ, అమ్మాయి బాగుంది, టాటా బిర్లా మధ్యలో లైలా వంటి హిట్స్ అందుకున్నాడు. సడన్ గా పరిశ్రమకు దూరమైన శివాజీ పొలిటికల్ కామెంట్స్ తో ఫేమస్ అయ్యాడు. మొదట్లో నారా చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేశారు. అనంతరం బాబు వర్గంలో చేరి మోడీపై నిప్పులు చెరిగారు. ఏపీ మీద మోడీ పన్నుతున్న కుట్ర ఇదే అంటూ గరుడ పురాణం చెప్పాడు.
పరిశ్రమ మీద, కొందరు హీరోల మీద కూడా శివాజీ పరోక్షంగా సంచలన ఆరోపణలు చేశారు. ఈ పరిణామాలతో ఒక కాంట్రవర్సీ ఇమేజ్ తెచ్చుకున్నాడు. అలాంటి శివాజీ బిగ్ బాస్ హౌస్లోకి వెళుతున్నాడనే న్యూస్ సంచలనం రేపింది. మనోడు హౌస్లో ఎంత రచ్చ చేయనున్నాడో అనే సందేహాలు మొదలయ్యాయి. అయితే మొదటి నుండి శివాజీ గేమ్ కూల్ గా ఆడుతున్నాడు. కాఫీ ఇవ్వలేదని ఒకటి రెండుసార్లు బిగ్ బాస్ మీద ఫైర్ అయ్యాడు.
కంటెస్టెంట్స్ తో తీవ్ర గొడవపడిన సందర్భాలు అయితే తక్కువే. హౌస్లో పెద్దరికం అనుభవిస్తున్న శివాజీ అమ్మా, ఏరా అంటూ హౌస్ మేట్స్ ని స్మూత్ గా హ్యాండిల్ చేస్తున్నాడు. ప్రిన్క్ యావర్, పల్లవి ప్రశాంత్ అయితే శిష్యులు అయిపోయారు. డామినేషన్ కి గురవుతున్న కంటెస్టెంట్స్ గా ఉన్న పల్లవి ప్రశాంత్, యావర్ లకు అండగా నిలవడం కూడా శివాజీకి కలిసొచ్చింది. ఆడియన్స్ లో ఫేమ్ రాబట్టాడు.
కాగా బుధవారం ఎపిసోడ్లో శివాజీ కన్నీరు పెట్టుకున్నాడు. ఓ టాస్క్ లో భాగంగా శివాజీ భుజానికి గాయమైంది. అతడు గాయాతోనే హౌస్లో కొనసాగుతున్నాడు. హౌస్లో ఉండాలని లేదు. మీ ఇద్దరి కోసమే ఇంట్లో ఉంటున్నా అని యావర్ ముందు కన్నీరు పెట్టుకున్నాడు. మీరు స్ట్రాంగ్ అన్నా అలా అనొద్దు అంటూ యావర్ కౌగలించుకుని ఓదార్చే ప్రయత్నం చేశాడు. అదే సమయానికి పల్లవి ప్రశాంత్ కూడా అక్కడకు వచ్చాడు. నా బిడ్డల మీద ఒట్టు మీ ఇద్దరి కారణంగానే హౌసులో ఉంటున్నానని ఇద్దరినీ కౌగలించుకుని ఏడ్చాడు.