Dhandoraa 2 Days Collections: గత రెండు మూడు రోజులుగా ఎక్కడ చూసినా నటుడు శివాజీ(Actor Sivaji) హీరోయిన్స్ ధరించే దుస్తులపై చేసిన కామెంట్స్ గురించే చర్చ. న్యూస్ చానెల్స్ పెట్టినా దీని గురించే డిబేట్స్, సోషల్ మీడియా లో కూడా దీని గురించే డిబేట్స్ నడుస్తున్నాయి. సెలబ్రిటీలంతా ఒక్కసారిగా శివాజీ పై దాడి చేస్తుంటే, శివాజీ పై మాత్రం పాజిటివిటీ జనాల్లో రోజురోజుకి పెరుగుతూ పోతుంది. నాగబాబు, రామ్ గోపాల్ వర్మ వంటి పెద్ద స్థాయి వ్యక్తులు కూడా శివాజీ కామెంట్స్ ని తప్పుబడుతూ సోషల్ మీడియా లో రెచ్చిపోయారు. నేడు శివాజీ తానూ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు మహిళా కమిషన్ కి కూడా హాజరయ్యాడు. ఇదంతా ఆయన ‘దండోరా'(Dhandora Movie) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన మాటల వల్లే జరిగింది. శివాజీ కి జనాల్లో పాజిటివిటీ పెరిగింది కదా, ‘దండోరా’ కి కలెక్షన్స్ కుమ్మేస్తాయని ఆ చిత్ర నిర్మాత అనుకొని ఉండొచ్చు.
కానీ అలాంటివేమీ జరగలేదు. మొదటి రోజు కోటి రూపాయిల లోపే గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి, రెండవ రోజు అందులో సగం కూడా రాలేదు. ఓవరాల్ గా ఫ్లాప్ దిశగా అడుగులు వేస్తోంది. సినిమాలో మ్యాటర్ లేకపోతే ఇలాంటివే జరుగుతాయని మీరు అనుకోవచ్చు , కానీ సినిమాలో మ్యాటర్ ఉంది. ఇప్పటి వరకు ఈ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరు చాలా మంచి సినిమా ని అందించారని, సమాజం లో కుల వివక్ష వల్ల జరుగుతున్నా దారుణాలను ఉన్నది ఉన్నట్టుగా చూపించారని, శివాజీ మరోసారి తన అద్భుతమైన నటన తో దుమ్ము లేపేసాడని అంటున్నారు. క్రిస్మస్ కానుకగా నాలుగు సినిమాలు విడుదలైతే, దండోరా చిత్రానికే మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ ఎందుకో ఆడియన్స్ టికెట్స్ మాత్రం తెంచడం లేదు. బహుశా వాళ్లకు ఈ చిత్రాన్ని ఓటీటీ లో చూసుకోవచ్చులే అనే ఫీలింగ్ కలిగిందేమో.
ఎందుకంటే ఈ చిత్రం లో ట్రెండింగ్ నటీనటులు ఎవ్వరూ లేరు. శివాజీ ని చూసి ఈ కాలం లో థియేటర్స్ కి కదిలే ఆడియన్స్ లేరు. నవదీప్,బిందు మాధవి, నందు వంటి నటులకు అసలు మార్కెట్ లేదు. అందుకే పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా ఈ చిత్రం అనుకున్న రేంజ్ కి చేరుకోలేకపోతుంది. మరోపక్క మూవీ టీం ప్రొమోషన్స్ మాత్రం చాలా బలంగా చేస్తోంది. అది సినిమాకు ఏ మాత్రం ఉపయోగపడకపోవడం గమనార్హం. పోనీ శివాజీ వివాదాస్పద వ్యాఖ్యల వల్ల సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ దొరుకుంటుందని అనుకుంటే అది కూడా జరగలేదు. ఇప్పుడు ఈ సినిమా బాగున్నప్పటికీ కూడా కలెక్షన్స్ రాకపోవడానికి కారణం నా నోటి దూల వల్లనేనా అని శివాజీ ఒక ట్రోమాలోకి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి.