Shiva rewrites history: తెలుగు చలన చిత్ర పరిశ్రమ గర్వించే సినిమాల్లో ఒకటి శివ(Shiva Re Release). ఒకే మూసలో వెళ్తున్న తెలుగు కమర్షియల్ సినిమా ఫార్మటు ని మార్చేసిన చిత్రమిది. షాట్ మేకింగ్ లో లెజండరీ డైరెక్టర్స్ కి కూడా కొత్త పాఠాలు నేర్పించిన చిత్రమిది. ఆరోజుల్లోనే పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన హిందీ లో, తమిళం లో కూడా సూపర్ హిట్ గా నిల్చిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ స్టేటస్ ఈ చిత్రం సొంతం. ఆరోజుల్లో యూత్ ఆడియన్స్ మొత్తం సైకిల్ చైన్స్ ని పెట్టుకొని తిరిగేవారు. ఈ రేంజ్ లో సునామీ క్రియేట్ చేసిన ఈ చిత్రాన్ని రీసెంట్ గానే లేటెస్ట్ 4K టెక్నాలజీ, మరియు డాల్బీ అట్మాస్ సౌండ్ మిక్సింగ్ చేసి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేశారు. విడుదలకు ముందు ప్రొమోషన్స్ తోనే ఆడియన్స్ లో ఒక సరికొత్త ఆసక్తిని కలిగతించేలా చేశారు.
అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, ఇలా స్టార్ హీరోలందరూ ఈ సినిమాకు ప్రొమోషన్స్ కూడా చేశారు. ఇలా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని విడుదల చేసిన ఈ సినిమా ఆరోజున విడుదలైన కొత్త సినిమాలను కూడా ఈ చిత్రం డామినేట్ చేసింది అంటేనే అర్థం చేసుకోవచ్చు, ఆడియన్స్ ఈ చిత్రానికి ఏ రేంజ్ లో బ్రహ్మరథం పట్టారు అనేది. మూడు రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత గ్రాస్ వసూళ్లను రాబట్టింది అనేది ఇప్పుడు వివరంగా చూడబోతున్నాం. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు కోటి 85 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 2 కోట్ల 45 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక రెండవ రోజున తెలుగు రాష్ట్రాల నుండి 62 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, వరల్డ్ వైడ్ గా 80 లక్షల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది.
ఇక మూడవ రోజున కూడా ఈ చిత్రం దాదాపుగా అదే రేంజ్ ట్రెండ్ ని కొనసాగించింది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే 75 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయని. ఓవరాల్ గా మూడు రోజులకు కలిపి ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు. ఇక నార్త్ అమెరికా లో అయితే ఈ సినిమా ఆల్ టైం టాప్ 4 చిత్రాల్లో ఒకటి గా నిల్చింది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు రీ రిలీజ్ రికార్డ్స్ ని కూడా ఈ చిత్రం నార్త్ అమెరికా లో దాటేసింది. ఇది అక్కడి ట్రేడ్ కి కూడా పెద్ద షాక్ అనే చెప్పాలి.