Ram Gopal Varma Shiva Movie: తెలుగు సినిమా పరిశ్రమలో శివ సృష్టించిన సంచలనం మామూలుది కాదు. సినిమా చరిత్ర గతినే మార్చిన రాంగోపాల్ వర్మకు మంచి హిట్ దొరికింది. దీంతో శివ సినిమా క్రియేట్ చేసిన ట్రెండ్ తో పరిశ్రమ గతి మారింది. నాగార్జున కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. తరువాత బాలీవుడ్ లో కూడా రాంగోపాల్ వర్మ రంగీలా వంటి సినిమా తీసి తనకు ఎదురు లేదని నిరూపించుకున్నాడు. మంచి సినిమాలు ఎక్కువగా కాపీ కొట్టినవే ఉండటం గమనార్హం.

చిరంజీవి ఖైదీ కూడా కాపీనే. ఓ ఆంగ్ల చిత్రం నుంచి కాపీ చేసి ఖైదీ సినిమాను పరిచూరి బ్రదర్స్ కథ అల్లారు. దీంతో ఇది చిరంజీవికి ఎంత పెద్ద హిట్ తెచ్చిపెట్టిందో తెలిసిందే. అలాగే నాగార్జునకు కూడా శివ అలాంటి విజయమే ఇచ్చింది. దీంతో నాగార్జునకు పెద్ద బ్రేక్ ఇచ్చింది. అంతకుముందు అంత పెద్ద హిట్ సాధించని నాగార్జున ఈ సినిమాతో మంచి ఊపు తెచ్చుకున్నాడు. ఇందులోని పాటలు కూడా ప్రేక్షకులను కట్టిపడేశాయి. శివ సినిమాతోనే సైకిల్ చైన్ తో ఫైట్ కూడా చేయొచ్చనే విషయం అందరికి తెలిసిపోవడం గమ్మత్తైన విషయమే.
Also Read: Bhavadeeyudu Bhagat Singh: ‘భవదీయుడు’ ని పక్కన పెట్టేసిన హరీష్ శంకర్..పవన్ ఫాన్స్ కి ఊహించని షాక్
శివ కూడా ఓ చైనా చిత్రం కాపీ అని ఇప్పటికి కూడా మనకు తెలియదు. ఈ విషయం కూడా రాంగోపాల్ వర్మనే స్వయంగా ఇటీవల వెల్లడించడంతో బయటకు తెలిసింది. బ్రూస్ లీ నటించిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అనే సినిమాకు కాపీనే శివ అని వెల్లడించడంతో అందరు ఆశ్చర్యపోయారు. ఇన్నాళ్లు శివ స్ట్రెయిట్ చిత్రమే అని నమ్మారు. కానీ ఆర్జీవీ వెల్లడించిన రహస్యంతో శివ సినిమా విషయం ఒక్కసారిగా సంచలనం కలిగించింది. ఆ సినిమాలో రెస్టారెంట్ కోసం హీరో పోరాడతాడు. ఈ సినిమాలో కాలేజ్ నేపథ్యం ఉంటుంది.

రెస్టారెంట్ స్థానంలో కాలేజ్ పెట్టి సినిమా అంతా సేమ్ టు సేమ్. అందుకే ఈ సినిమా స్క్కిప్ట్ ఇరవై నిమిషాల్లోనే పూర్తి చేశాడట. మొత్తానికి చలన చిత్ర రంగాన్ని ఓ ఊపు ఊపేసిన శివ సినిమా కూడా కాపీయే కావడం గమనార్హం. రాంగోపాల్ వర్మ తరువాత తీసిన సినిమాలు హిట్ సాధించినా ఇటీవల కాలంలో అంతగా ఆడటం లేదు. ఇప్పుడు కొత్తగా లడ్కీ అనే సినిమా తీశాడు. అది విడుదలకు సిద్ధంగా ఉంది. కొంతకాలంగా ఆర్జీవీ సినిమాల్లో నాణ్యత తగ్గిందనే వాదనలు వస్తున్నాయి. మొత్తానికి ఆర్జీవీ ఏది చేసినా సంచలనమే. అదో గొప్ప ట్రెండ్ సృష్టించే విధంగా మలచడం ఆయనకు అలవాటే. అందుకే తన సినిమాలు విడుదల కంటే ముందే వివాదాస్పదంగా మారడం కూడా ఓ ట్రెండే.
Also Read:Pavan Kalyan: విజయ్ సినిమాకి ‘నో’ చెప్పిన పవన్ కళ్యాణ్
[…] Also Read: Ram Gopal Varma Shiva Movie: శివ సినిమా కూడా కాపీయేనా? వ… […]
[…] Also Read: Ram Gopal Varma Shiva Movie: శివ సినిమా కూడా కాపీయేనా? వ… […]