Shilpa Shetty: హీరోయిన్స్ ఇండస్ట్రీల్లో తక్కువ కాలం కొనసాగుతారు. ఇది తెరఎరిగిన సత్యం. తక్కువ కాలంలోనే ఫేడ్ అవుట్ అవుతుంటారు. సినిమాలు ఫెయిల్ అయితే హీరో మీద కంటే నటీమణి మీదే మచ్చ పడుతుంది. కెరీర్ లో ప్రాజెక్టులు రావడం తగ్గితే వెంటనే మ్యారేజ్ లైఫ్ లోకి అడుగుపెడతారు. ఇక అప్పటి నుంచి వారు పెద్దగా కనిపించరు. కానీ ఎప్పుడో ఒకప్పుడు కనిపిస్తే వారిని గుర్తు పట్టడం వారి అభిమానులకే కష్టంగానే మారుతుంది. నాజూగ్గా.. అందంగా.. అస్సలు వయస్సు కనిపించనీయరు. అందులో చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. బాలీవుడ్ లో వీరి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. బాలీవుడ్ నుంచి 1996లో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన హీరోయిన్ చాలా కాలం క్రితం వెండితెరపై కనిపించడం మానేసింది. ఇప్పుడు ఆమె వయస్సును అస్సులు అంచనా వేయలేకపోతున్నారు. ‘సాహస వీరుడు సాగర కన్య’తో టాలీవుడ్ కు పరిచయం అయిన బాలీవుడ్ ముద్దుగుమ్మ శిల్పాశెట్టి. ఈమె ఇండస్ట్రీపై అడుగు పెట్టి 30 ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ ఆమెను అభిమానించే వారు దేశ వ్యాప్తంగా చాలా మందే ఉన్నారు. సినిమాల్లో కనిపించినా.. కనిపించకున్నా.. ఒక వర్గం ప్రేక్షకులు ఆమెపై అభిమానం కురిపిస్తూనే ఉంటారు.
అంత పెద్ద ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్న శిల్పాశెట్టి వయస్సు ఇప్పుడు 49 సంవత్సరాలు. ఈ ఈడులో ఎక్కువ శాతం ఫ్యామిలీకే పరిమితం అవుతుంటారు. శిల్పా మాత్రం పాతికేళ్ల పడుచు పిల్లలా ఇప్పటికీ యంగ్ హీరోయిన్స్ కు పోటీని ఇస్తుంది. నటిగా మాత్రమే కాకుండా యోగా ట్రైనర్ గా కూడా రాణిస్తున్నారు. ఆమె ఫిజిక్ పాతికేళ్ల అమ్మాయి లాగానే ఉంటుంది. ఎక్కడా వయస్సు కనిపించకుండా జాగ్రత్త పడుతుంది. యవ్వనంటో ఎలా ఉండే ఇప్పటికీ ఆమె మొహం అలానే ఉంది. ఇప్పుడు కాస్త ఎక్కువ అందంగా కనిపిస్తుంది.
శిల్పా రెగ్యులర్ గా తన ఫొటోలను ఇన్ స్టా, ఎక్స్ లో షేర్ చేస్తుంటుంది. ఈ సారి జిమ్‌లో వర్కవుట్ వీడియో, ఫొటోలను ఇన్ స్టాలో షేర్ చేసింది. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మినీ షార్ట్, స్పోర్ట్స్ టాప్ ధరించి నడుము అందం చపిస్తుంది. శిల్పా సాధారణంగానే అందంగా ఉంటుంది. ఇక ఈ ఔట్ ఫిట్‌లో చూస్తే కండ్లు తిప్పుకోలేం అంటూ కామెంట్లు చేస్తున్నారు.
శిల్పా పెళ్లయిన ఇన్ని సంవత్సరాల తర్వాత, ఇంత ఫిట్‌గా ఉండడం గొప్ప విషయంమే ఈమె ఎంతో మందికి ఆదర్శం. ముఖ్యంగా ఇండస్ట్రీలోని యంగ్ హీరోయిన్స్ ఆమెను రోల్ మోడల్ గా తీసుకుంటారు. మరో పదేళ్లయినా శిల్ప అందం తగ్గదేమో అంటూ అభిమానులు ఈ ఫొటోలను లైక్ చేస్తున్నారు. ఇంతటి అంద మొయింటెన్ చేస్తున్నా ఎందుకు తెరపైకి రావడం లేదని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇకపై ఆమె నుంచి సినిమాలు రావాలని కోరుకుందాం.