శిల్పా శెట్టి అజ్ఞాతంలోకి.. మరి నీలి నిజాల మాటేమిటి !

అరెరే.. బ్యూటీ శిల్పా శెట్టి ఏమైపోయింది ? ఎక్కడా కనబడటం లేదు ఏమిటి ? నీలి చిత్రాల కేసులో మొగుడ్ని అరెస్ట్ చేసి బొక్కలో వేస్తే.. మరి ముదురు భామ శిల్పా ఎందుకు మొహం చాటేస్తోంది. అంటే.. తన భర్త బాగోతం గురించి శిల్పా బేబీకి ముందే తెలుసా ? అసలు పోర్నోగ్రఫీ ఆరోపణల నేపథ్యంలో రాజ్ కుంద్రాను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేసినప్పుడు ఆమె పక్కనే ఉంది. మరి అంతలోనే శిల్పాశెట్టి ఎందుకు […]

Written By: admin, Updated On : July 22, 2021 4:51 pm
Follow us on

అరెరే.. బ్యూటీ శిల్పా శెట్టి ఏమైపోయింది ? ఎక్కడా కనబడటం లేదు ఏమిటి ? నీలి చిత్రాల కేసులో మొగుడ్ని అరెస్ట్ చేసి బొక్కలో వేస్తే.. మరి ముదురు భామ శిల్పా ఎందుకు మొహం చాటేస్తోంది. అంటే.. తన భర్త బాగోతం గురించి శిల్పా బేబీకి ముందే తెలుసా ? అసలు పోర్నోగ్రఫీ ఆరోపణల నేపథ్యంలో రాజ్ కుంద్రాను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేసినప్పుడు ఆమె పక్కనే ఉంది.

మరి అంతలోనే శిల్పాశెట్టి ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది ? ఇందులో ఎలాంటి నిజం లేకపోతే.. మీడియాకు ఎందుకు శిల్పా దూరంగా ఉంటుంది. ప్రస్తుతానికి అయితే శిల్పా ఆచూకీ ఎవరికి లభ్యం కావడం లేదట. సన్నిహితులకు కూడా దొరకడం లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది.

అయితే సినీ వర్గాల సమాచారం ప్రకారం జుహూ ప్రాంతంలో శిల్పా తన కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తుంది. కానీ మీడియా వెళ్తే.. ఆమె అక్కడ లేదు అంటున్నారు. అయితే, శిల్పా శెట్టి ప్రస్తుతం సూపర్ డ్యాన్సర్ షో 4వ సీజన్ కు జడ్జిగా కూడా ఉంది. ఈ షోలో పాల్గొనేందుకు ఆమె రేపు వెళ్ళాల్సి ఉంది.

కానీ షోకు కూడా ఆమె అందుబాటులోకి రావడం లేదట. ఇలా అయితే ఎలా ? నీలి చిత్రాల విషయంలో తన పాత్ర లేనప్పుడు శిల్పా ఇలా దూరంగా ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది అని అంటున్నారు నెటిజన్లు. ఇప్పటికైనా శిల్పా బయట ప్రపంచంలోకి వచ్చి, రాజ్ కుంద్రా పై పోర్నోగ్రఫీ ఆరోపణల విషయంలో తనకు తెలిసిన నిజాలు చెబితే.. కనీసం తన పరువు అయినా నిలబడుతుంది.

గతంలో ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలు గా ఉన్న సమయంలో ఈ దంపతులు ఫిక్సింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. మొత్తానికి శిల్పా తప్పుడు వ్యక్తిని పెళ్లి చేసుకుందనే కామెంట్స్ బాగా వినిపిస్తున్నాయి.