Shekhar Master : దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన మూవీ మిస్టర్ బచ్చన్. బాక్సాఫీస్ వద్ద మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ అయ్యింది. రవితేజ ఫ్యాన్స్ సైతం మిస్టర్ బచ్చన్ మూవీపై పెదవి విరిచాడు. దానికి తోడు రవితేజ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే వేసిన ఓ స్టెప్ వివాదాస్పదం అయ్యింది. పట్టుమని పాతికేళ్ళు లేని భాగ్యశ్రీతో రవితేజ అలాంటి స్టెప్స్ వేయడంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. భాగ్యశ్రీ చీర కుచ్చిళ్ళు పట్టుకుని రవితేజ ఆ సినిమాలో స్టెప్ వేస్తాడు. ఈ స్టెప్ మీద హరీష్ శంకర్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
Also Read : శేఖర్ మాస్టర్ లో పస తగ్గిపోయిందా..? పుష్ప 2 లో పెద్ద తప్పు చేశాడుగా…
శేఖర్ మాస్టర్ ఆ రోజే సెట్స్ కి వచ్చాడు. వచ్చిన రోజే నాకు ఇది వద్దు అది వద్దు అంటే డిస్ట్రబ్ అవుతాడు. నాకు ఆ స్టెప్ నచ్చకపోయినా చెప్పలేకపోయాను, అన్నాడు. మిస్టర్ బచ్చన్ విషయంలో అంత రాద్ధాంతం జరిగినప్పటికీ డాకు మహారాజ్ మూవీలో అంతకు మించిన దారుణమైన స్టెప్స్ కంపోజ్ చేశాడు శేఖర్ మాస్టర్. దబిడి దిబిడి సాంగ్ లో బాలయ్య హీరోయిన్ ఊర్వశి రాతెలా హిప్ పై గుద్దడం, అసభ్యకరమైన హ్యాండ్ మూమెంట్స్ విమర్శల పాలయ్యాయి. ఈ మూవీ విడుదలైన సమయంలోనే బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించారు.
ఊర్వశి రాతెలాతో వేసిన బాలయ్య నార్త్ జనాలు వైరల్ చేస్తూ.. ఇలాంటి వ్యక్తికి పద్మభూషణ్ ఇచ్చారంటూ ఎద్దేవా చేశారు. ఆ విమర్శలు పట్టించుకోని బాలకృష్ణ డాకు మహారాజ్ సక్సెస్ మీట్ లో ఊర్వశితో మరలా ఆ స్టెప్ మరింత బోల్డ్ గా వేసి చూపించాడు. డాకు మహారాజ్, మిస్టర్ బచ్చన్ చిత్రాలతో శేఖర్ మాస్టర్ వల్గర్ స్టెప్స్ పై విమర్శలు వెల్లువెత్తాయి. కానీ శేఖర్ మాస్టర్ తీరు మారలేదు. తాజాగా మరో మూవీలోని ఆ కంపోజ్ చేసిన సాంగ్ స్టెప్స్ దారుణంగా ఉన్నాయి.
నితిన్ హీరోగా దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించిన రాబిన్ హుడ్ మూవీ విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ చిత్రంలో కేతిక శర్మ ఓ ఐటెం సాంగ్ చేసింది. ఈ సాంగ్ లిరికల్ వీడియో విడుదలైంది. కేతిక శర్మ వేసిన స్టెప్స్ చాలా బోల్డ్ గా ఉన్నాయి. ఫ్రాక్ ముందుకు లాగి ఆమె వేసిన డాన్స్ మూమెంట్ అసభ్యకరంగా తోస్తుంది. వరుస పరిణామాలు నేపథ్యంలో శేఖర్ మాస్టర్ కి ఏమైంది? ఆయన ఎందుకు ఎలాంటి స్టెప్స్ కంపోజ్ చేస్తున్నాడు. వివాదాలు రాజేస్తున్నాడు అనే వాదన మొదలైంది.
Also Read : శేఖర్ మాస్టర్ సీక్రెట్ ఎఫైర్స్… హైపర్ ఆది నోరు విప్పడంతో స్టార్ కొరియోగ్రాఫర్ బండారం బయటకు!