https://oktelugu.com/

Bigg Boss 8 Telugu: నాగార్జునకే ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసిన శేఖర్ బాషా..ఇతన్ని తీసుకెళ్లి మ్యూజియం లో పెట్టాల్సిందే!

విష్ణు ప్రియా ని నామినేట్ చేసినందుకు ఆమెకి కూడా జోకులు చెప్పాడట. మళ్ళీ నామినేట్ చేస్తావా, ఈసారి నీ ఒక్కడినికే 500 జోకులు చెప్తాను నువ్వు నన్ను నామినేట్ చేస్తే అని బెదిరిస్తున్నాడు అంటూ విష్ణు ప్రియా నాగార్జున కి చెప్పుకొని నవ్వుతుంది.

Written By:
  • Vicky
  • , Updated On : September 9, 2024 / 08:25 AM IST

    Bigg Boss 8 Telugu(27)

    Follow us on

    Bigg Boss 8 Telugu: శేఖర్ బాషా ని యూట్యూబ్ చానెల్స్ లో రాజ్ తరుణ్ – లావణ్య వ్యవహారంలోకి దూరి రాజ్ తరుణ్ తరుపున మాట్లాడినప్పుడు ఆడియన్స్ అందరూ ఇతనిని బాగా గమనించారు. చాలా లాజికల్ గా మాట్లాడుతున్నాడే, ఎవరూ ఇతను అని ఆయనని గూగుల్ లో వెతకడం మొదలు పెట్టారు. ఆలా వెతికిన తర్వాత ఇతని గురించి చాలా విషయాలు తెలిసాయి. ఇతను ఒక పాపులర్ రేడియో జాకీ అని, దేశం లోనే అత్యధిక అవార్డ్స్ కలిగిన ఏకైక ఆర్జే అట ఈయన. అంతే కాదు జెమినీ మ్యూజిక్ లో ఈయన హోస్ట్ చేస్తున్నప్పుడు వదిలిన ఆణిముత్యాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు అలాంటి ఆణిముత్యాలు బిగ్ బాస్ హౌస్ లో వదులుతున్నాడు. ఈయన వేసే పంచులు చూస్తే అసలు ఈ రేంజ్ లో ఆయనకి ఎలా ఆలోచనలు వస్తాయి, అప్పటికప్పుడు ఆలోచించగలడు అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈరోజు ఇతను వేసే జోక్ భరించలేక, సగం మందికి పైగా కంటెస్టెంట్స్ ‘చిరాకు’ అనే పదం వేసి ఉంచిన బ్యాడ్జీని ఆయన మీదకి తగిలించారు. సీరియస్ గా చర్చ జరుగుతున్నప్పుడు శేఖర్ బాషా మధ్యలో వచ్చి ఎదో ఒక జోక్ పేల్చి వెళ్తాడు. ఏమి జోక్ వేసాడు అని ఆలోచించే లోపే ఆ పంచ్ మనల్ని దాటి వెళ్ళిపోతుంది అని అంటాడు.

    విష్ణు ప్రియా ని నామినేట్ చేసినందుకు ఆమెకి కూడా జోకులు చెప్పాడట. మళ్ళీ నామినేట్ చేస్తావా, ఈసారి నీ ఒక్కడినికే 500 జోకులు చెప్తాను నువ్వు నన్ను నామినేట్ చేస్తే అని బెదిరిస్తున్నాడు అంటూ విష్ణు ప్రియా నాగార్జున కి చెప్పుకొని నవ్వుతుంది. బయట డిబేట్స్ లో అంత ఫైర్ గా కనిపించిన శేఖర్ భాషలో ఈ రేంజ్ కామెడీ టైమింగ్ ఉందా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇదంతా పక్కన పెడితే నేడు కూడా ఆయన పలు అద్భుతమైన ఆణిముత్యాలు వదిలాడు. ‘దోమ’ అనే పదానికి అర్థమే మార్చేశాడు. దోమ అంటే ఇద్దరు అమ్మలు అట, అంటే ‘దో’ అనే రెండు, ‘మా’ అనగా అమ్మా, ఇద్దరు అమ్మలు అనే అర్థాన్ని తీసాడు. ఇది ఇలా ఉండగా హౌస్ మేట్స్ లో కొంతమంది యష్మీ గౌడ కి ‘సెల్ఫిష్’ అనే ట్యాగ్ ని మెడలో వేస్తారు. దీనికి శేఖర్ బాషా చెప్పిన అర్థం విని కంటెస్టెంట్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయాయి. సెల్ఫిష్ అంటే చేపలు అమ్మే అమ్మాయి అంట. సెల్ఫిష్ లో సెల్ అంటే అమ్మడం, ఫిష్ అంటే చేప, దానికి ఆయన ఇలాంటి అర్థం పట్టుకొచ్చాడు.

    ఇక చివర్లో మణికంఠ కూడా ఈయన జోకులు చిరాకు కలిగిస్తున్నాయి అంటూ చిరాకు ట్యాగ్ మెడలో వేస్తాడు. దీనికి కూడా శేఖర్ బాషా ప్రత్యేకమైన అర్థం చెప్తాడు. దీని గురించి మణికంఠ కి ఒకటి చెప్పాలి సార్ అని మొదలు పెట్టి ‘ఇతనికి కోపం వస్తే ఒంటరిగా కూర్చొని ఏదేదో మాట్లాడుకుంటూ ఉంటాడు, అతని దగ్గరకి వెళ్తే ‘చి’ ‘రాకు’ నా దగ్గరకి అని అంటాడు’ అని నాగార్జున కి వివరిస్తాడు, దీనికి నాగార్జున కూడా 2 నిమిషాల పాటు నాన్ స్టాప్ గా నవ్వుతాడు. ఇలాంటి జోకులు పాపం ఆదిత్య ఓం కి 200 కు పైగా చెప్పాడట, పాపం ఆయన పరిస్థితి ఎలా ఉండుంటుందో మనం ఊహించుకోవచ్చు.