https://oktelugu.com/

Bigg Boss 8 Telugu: బయటకి వెళ్తూ 5 మంది కంటెస్టెంట్స్ ని రోడ్డున పడేసిన బెజవాడ బేబక్క..ఈ ఫైర్ ముందు ఉండుంటే బాగుండేది!

బేబక్క తనని తాను డిఫెండ్ చేసుకోవడం లో విఫలం అయ్యింది. చీఫ్స్ రేస్ నుండి బేబక్క ని నిఖిల్ మరియు నైనికా తేసేసినప్పుడు కూడా ఆమె నుండి ఎలాంటి రియాక్షన్ లేదు. ఒకవేళ ఆమె చీఫ్ అయ్యుంటే ఈ నామినేషన్స్ నుండి తప్పించుకునే అవకాశం ఉండేది.

Written By:
  • Vicky
  • , Updated On : September 9, 2024 / 08:32 AM IST

    Bigg Boss 8 Telugu(28)

    Follow us on

    Bigg Boss 8 Telugu: చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ప్రయోజనం ఏమిటి అని పెద్దలు సామెత ఊరికే చెప్పలేదు. జీవితంలో ఎన్నో ఉదాహరణలు చూసి చెప్పిన సామెతలు ఇవి. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 లో పాపం బేబక్క పరిస్థితి చూస్తే అదే అనిపిస్తుంది. ఈమె హౌస్ లో అడుగుపెట్టిన రోజు నుండి చాలా కూల్ గా, సాఫ్ట్ గా ఉన్నింది. అందరితో బాగా కలిసిపోయింది కానీ, వంట బాగా ఆలస్యం చేస్తుంది అనే కంప్లైంట్స్ ఎక్కువగా వచ్చేవి. ఆ పాయింట్ మీదనే ఈమె పై కంటెస్టెంట్స్ అందరూ నామినేషన్స్ వేశారు. కానీ బేబక్క తనని తాను డిఫెండ్ చేసుకోవడం లో విఫలం అయ్యింది. చీఫ్స్ రేస్ నుండి బేబక్క ని నిఖిల్ మరియు నైనికా తేసేసినప్పుడు కూడా ఆమె నుండి ఎలాంటి రియాక్షన్ లేదు. ఒకవేళ ఆమె చీఫ్ అయ్యుంటే ఈ నామినేషన్స్ నుండి తప్పించుకునే అవకాశం ఉండేది.

    అంతా అయిపోయాక చివరి నిమిషంలో తనలోని ఫైర్ ని తీసింది. ఎలా అయినా ఆడి గెలవాలి, నేనేంటో చూపిస్తా అంటూ రెచ్చిపోయింది. తనని తాను నిరూపించుకోవాలి అనే ఆలోచన రాగానే చేతిలో ఉన్న పుణ్యకాలం మొత్తం గడిచిపోయింది. ఓటింగ్ లైన్స్ అప్పటికే క్లోజ్ అయ్యాయి, బేబక్క ని ఇంటికి పంపేశారు. ఇప్పుడు స్టేజి మీదకు వచ్చిన తర్వాత అవకాశం ఉంటే ఇంకో ఛాన్స్, నన్ను నేను నిరూపించుకుంటాను అంటూ నాగార్జున ని అడుగుతుంది. ఈ ఫైర్ ఎదో మొదటి రోజు నుండే చూపించి ఉంటే ఈరోజు నువ్వు ఇంటికి వెళ్లాల్సిన దుస్థితి ఉండేది కాదు కదా అనేది ఆడియన్స్ అభిప్రాయం. అయితే వెళ్లే ముందు నాగార్జున బేబక్క కి ఒక చిన్న టాస్క్ పెట్టాడు. హౌస్ లో కొనసాగడానికి ఏమాత్రం అర్హత లేని వాళ్ళను రోడ్డున పారెయ్ అంటూ ఒక్క బోర్డు మీద బిగ్ బాస్ హౌస్ ముందర ఉన్న రోడ్ చూపిస్తాడు నాగార్జున. అప్పుడు బేబక్క సోనియా , నిఖిల్, నాగ మణికంఠ, పృథ్వీ రాజ్ ఫోటోలను రోడ్డు మీద పెడుతుంది.

    ముందుగా సోనియా గురించి మాట్లాడుతూ ఆమెలో ప్రతీ విషయంలో నాకు నెగటివ్ వైబ్స్ కనపడుతున్నాయి, ఆమెకి నేను మనిషిగా అనిపించడం లేదు అని చెప్పింది. ఇక ఆ తర్వాత పృథ్వీ గురించి మాట్లాడుతూ నువ్వు నన్ను బిగ్ బాస్ కి అన్ ఫిట్ అన్నావు , నేను ఫిట్నెస్ పెంచాను, కానీ నాకు అనిపించింది ఏమిటంటే నీలో కూడా కోపం ఎక్కువ ఉంది, అది బిగ్ బాస్ కి పనికి రాదు, నామినేషన్స్ సమయంలో చాలా మాటలు వదిలేసావు, ఆ తర్వాత చాలాసార్లు క్షమాపణలు చెప్పావు, నేను ఒక తమ్ముడిగా భావించి క్షమించేసాను, కాస్త ఆ పద్దతి మార్చుకో అంటూ చెప్పుకొచ్చింది బేబక్క. ఆ తర్వాత నిఖిల్ గురించి మాట్లాడుతూ కుకింగ్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి, ఎవరికీ వారు వంట చేసుకోడానికి వీలు లేదు, అతను నా చేత దగ్గరుండి కారం ఎక్కువ వేయించాడు, హౌస్ లో నాకు తిట్లు పడ్డాయి, ఈరోజు నేను ఎలిమినేట్ అవ్వడానికి ఒక్క కారణం అయ్యాడు అంటూ చెప్పుకొచ్చింది. ఇక చివర్లో మణికంఠ గురించి మాట్లాడుతూ నువ్వు ఒక్కడివే ఉండిపోతున్నావు, అందరితో కలవు, ఎమోషనల్ అవ్వకు అని అతనికి ధైర్యం చెప్పింది.