Shekar Kammula : టాలీవుడ్ లో నూటికి నూరు శాతం సక్సెస్ రేషియో ఉన్న డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా శేఖర్ కమ్ముల(Shekar Kammula) కూడా ఉంటాడు. ఈయన రూటే సపరేటు..కమర్షియల్ సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు, మాస్ సినిమాలు ఇలా డైరెక్టర్స్ సక్సెస్ కోసం సులువైన మార్గాలు ఎంచుకుంటూ ముందుకు పోతుంటే, శేఖర్ కమ్ముల మాత్రం భిన్నమైన ఆలోచనలతో సినిమాలు తీస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నాడు. శేఖర్ కమ్ముల సినిమా అంటే ఒక బ్రాండ్. ఆయన సినిమాల్లోని ఎమోషన్స్ సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది, హృదయాలను హత్తుకునే విధంగా ఉంటుంది, అద్దంలో మన జీవితాలను మనమే చూసుకున్నట్టుగా అనిపిస్తుంటాయి ఆయన సినిమాలు. అలాంటి శేఖర్ కమ్ముల ఇప్పటి వరకు తాను ముట్టుకొని జానర్ తో ‘కుబేర'(Kubera Movie) చిత్రం ద్వారా మన ముందుకు రాబోతున్నాడు. ఈ నెల 20 న ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది.
ఈ సందర్భంగా నిన్న హైదరాబాద్ లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేసి థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ ట్రైలర్ కి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి రెస్పాన్స్ అదిరిపోయింది. కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది అనే ఫీలింగ్ ని ప్రతీ ఒక్కరిలో కల్పించింది ఈ చిత్రం. ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక ఈ ముగ్గురి నుండి ఎంత నటన బయటకు రాబట్టలో అంత నటనను రాబట్టేసుకున్నట్టు ట్రైలర్ ని చూస్తే స్పష్టంగా అర్థం అవుతుంది. ఇదంతా పక్కన పెడితే శేఖర్ కమ్ముల గతంలో ఒక స్టార్ హీరోయిన్ గురించి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకు అంతలా ఆయన ఏమి మాట్లాడాడో ఒకసారి చూద్దాం. కొత్తవాళ్లతో ఎక్కువగా సినిమాలు చేస్తూ వచ్చే శేఖర్ కమ్ముల, అప్పట్లో నయనతార(Nayanthara) తో ‘అనామిక’ అనే సినిమా తీసాడు.
ఇది డైరెక్ట్ తమిళ సినిమా, తెలుగు లో డబ్ చేసి విడుదల చేశారు. రెండు భాషల్లోనూ ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. శేఖర్ కమ్ముల కెరీర్ లో అతి పెద్ద ఫ్లాప్ ఏదైనా ఉందా అంటే అది ఇదే. ఇదే ఆయనకు మొదటి ఫ్లాప్ సినిమా, బహుశా చివరి ఫ్లాప్ సినిమా కూడా ఇదే అవ్వొచ్చు. అయితే ఈ సినిమా ఫలితం గురించి శేఖర్ కమ్ముల మాట్లాడుతూ ‘అప్పట్లో నేను ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా చెయ్యాలని అనుకున్నాను. కానీ నా దగ్గర కథ లేదు. ఆ సమయం లో నేను ఒక రీమేక్ సబ్జెక్టు ని ఎంచుకొని అనామిక స్క్రిప్ట్ ని రెడీ చేసాను. ఈ కథకు నయనతార మాత్రమే సూట్ అవుతుంది అనుకోని తీసాము. కానీ ఆమె సూపర్ స్టార్ స్టేటస్ కారణంగానే ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.ఆమె రేంజ్ కి ఈ కథ సరిపోలేదని ఆ తర్వాత నాకు అనిపించింది’ అంటూ చెప్పుకొచ్చాడు శేఖర్ కమ్ముల.
