Sreemukhi : స్టార్ యాంకర్ శ్రీముఖి పెళ్లి ఎవర్ గ్రీన్ టాపిక్. తరచుగా పెళ్లి వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అలాగే డేటింగ్ చేశారంటూ పలువురితో లింక్ పెడుతూ కథనాలు వెలువడ్డాయి. తనపై వచ్చిన పుకార్లను శ్రీముఖి ఖండిస్తూ ఉంటారు. అయితే శ్రీముఖి ఒక హీరో మీద మనసు పారేసుకున్నారు. అంటే ఆయన్ని ప్రేమించారని, పెళ్లి చేసుకోవాలనుకున్నారని కాదు. ఆమెకు ఆయన మీద ఒక క్రేజీ డ్రీమ్ ఉందట. ఒక షోలో సదరు హీరోతో డేటింగ్ చేయాలని ఉందన్న కోరిక బయటపెట్టింది.
రియల్ కపుల్ పాల్గొన్న షోలో… ఫైమా యాంకర్ శ్రీముఖిని ఒక ప్రశ్న అడిగింది. నీకు పెళ్లి వద్దా? అని ఫైమా అనడంతో, మనకు ఏ హీరో సెట్ అవుతాడు? అని శ్రీముఖి అంది. ప్రభాస్ ఒక్కడే పెళ్లి కాకుండా ఉన్నాడని ఫైమా అంటుంది ఫైమా. ప్రభాస్ అయితే పెళ్లి కి ముందే ఒక రోజు డేట్ కి వెళతాను, అని శ్రీముఖి మనసులో కోరిక బయటపెట్టింది. ఎక్కడ కల్లోనా అని ఫైమా పంచ్ వేసింది.
ఆ విధంగా ప్రభాస్ మీద తనకున్న పిచ్చి ప్రేమను శ్రీముఖి ఓ సందర్భంలో బయటపెట్టింది. థర్టీ ప్లస్ లో అడుగుపెట్టిన శ్రీముఖి అప్పుడే పెళ్లేంటి అంటుంది. అందుకు ఇంకా సమయం ఉంది. కుదిరినప్పుడు నేనే చెబుతా. మీరు నిరాధార కథనాలు రాయకండి అంటూ సీరియస్ అవుతున్నారు. గత రెండు మూడేళ్ళలో శ్రీముఖి కెరీర్ బాగా పుంజుకుంది. ఆమె ఒకటి నాలుగు షోలలో యాంకర్ గా చేస్తున్నారు. చెప్పాలంటే శ్రీముఖి టాప్ పొజిషన్ లో ఉన్నారు.
మరోవైపు నటిగా రాణించే ప్రయత్నం చేస్తున్నారు. క్రేజీ అంకుల్స్ మూవీలో శ్రీముఖి హీరోయిన్ గా చేసింది. ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి. చిరంజీవి లేటెస్ట్ మూవీ భోళా శంకర్ లో శ్రీముఖి ఓ సర్ప్రైజింగ్ రోల్ చేశారనే ప్రచారం జరుగుతుంది. చిరంజీవితో ఆమెకు రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయట. ఆఫర్స్ వస్తున్నప్పటికీ శ్రీముఖి ఆచితూచి ఒప్పుకుంటున్నారని సమాచారం.