Sreeja- Surekha: అడిగింది ఒకటి.. చేసింది ఒకటి..సురేఖ పై అసహనం వ్యక్తం చేసిన మెగా డాటర్ శ్రీజ..

ముఖ్యంగా చిరంజీవి పెద్ద కూతురు కన్నా కూడా చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కొణిదెల సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తన ఇంస్టాగ్రామ్ లో తన విషయాలు ఎన్నో షేర్ చేసుకుంటూ ఉంటుంది శ్రీజ.

Written By: Swathi, Updated On : September 16, 2023 4:12 pm

Sreeja- Surekha

Follow us on

Sreeja- Surekha: మెగా ఫ్యామిలీలో ఎవరు ఏమి చేసినా అది పెద్ద వార్తగానే నిలుస్తుంది. ఎందుకంటే ఆ ఒక్క ఫ్యామిలీ నుంచి తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది పాపులర్ హీరోస్ ఉన్నారు కాబట్టి. ఇక హీరోసే కాదు ఈ ఫ్యామిలీ లో మెగా డాటర్స్ చేసే విషయాలు కూడా ఎప్పుడూ మీడియాలో వార్తలు గానే నిలుస్తూ ఉంటాయి.

ముఖ్యంగా చిరంజీవి పెద్ద కూతురు కన్నా కూడా చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కొణిదెల సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తన ఇంస్టాగ్రామ్ లో తన విషయాలు ఎన్నో షేర్ చేసుకుంటూ ఉంటుంది శ్రీజ. ముఖ్యంగా శ్రీజా తన ఫ్రెండ్స్ తో అలానే తన కూతుర్లతో కలిసి చేసే అల్లరి, వాటికి సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి.

ఈ నేపథ్యంలో శ్రీజ తన తల్లి సురేఖ గురించి పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. శ్రీజ తాజాగా తన అమ్మ సురేఖ మీద కామెంట్ చేసింది. అసలు విషయానికి వస్తే ప్రస్తుతం శ్రీజ పుట్టింట్లోనే ఉంటోంది. చిరు, సురేఖలతో కలిసి శ్రీజ, శ్రీజ పిల్లలు ఉంటున్నట్టుగా తెలుస్తోంది.

ఇక శ్రీజ కోసం సురేఖ రకరకాల వంటలు చేయగా అదే విషయాన్ని శ్రీజ తన ఇంస్టాగ్రామ్ ద్వారా తనదైన స్టైల్ లో ఒక పోస్ట్ పెట్టి అందరినీ ఆకట్టుకుంది. తాజాగా తన తల్లి చేసిన పనిపై శ్రీజ ఫన్నీగా పోస్ట్ వేసింది. నేను మా అమ్మని బాక్స్‌లో ఎగ్స్ పెట్టమని అంటే.. ఇలా ఇన్ని రకాల డిషెస్ చేసి పెడుతుంది? ఇవన్నీ ఏంటి? అన్నట్టుగా శ్రీజ వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

తాను కేవలం ఒక ఎగ్ అడిగితే.. సురేఖ మాత్రం అన్ని చేసి పెట్టింది అంటూ తమాషాగా తన అసహనాన్ని వ్యక్తం చేసింది శ్రీజ. ఇక ఈ పోస్ట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.