Surekhavani : సురేఖా వాణి పరిచయం అక్కర్లేని పేరు. చాలా కాలంగా ఆమె పరిశ్రమలో ఉన్నారు. సురేఖా వాణి యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టారు. మా టీవీ లో ఆమె యాంకర్ గా చేశారు. అప్పుడే సురేష్ తేజ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి సుప్రీత కూతురు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సురేష్ తేజ 2019లో కన్నుమూశాడు. దాంతో కొన్నాళ్ళు చిత్ర పరిశ్రమకు దూరమైంది. అది ఆమెకు మైనస్ అయ్యింది.
దానికి తోడు లాక్ డౌన్ కారణంగా మరింత గ్యాప్ వచ్చింది. ప్రేక్షకులు, దర్శక నిర్మాతలు సురేఖా వాణిని మర్చిపోయారు. ఆ మధ్య ఈ విషయంలో తన వేదన వెళ్లగక్కింది. దర్శక నిర్మాతలు నన్ను పక్కన పెట్టేశారు. ఆఫర్స్ ఇవ్వడం లేదంటూ వాపోయింది. కాగా సురేఖా వాణి రెండో వివాహం చేసుకుంటున్నారంటూ ప్రచారం జరిగింది. ఈ వార్తలపై సురేఖావాణి కూతురు స్పందించారు. ఆమె మండిపడ్డారు.
కాగా సురేఖా వాణి సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్. తరచుగా వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తుంది. ఆమె గ్లామర్ షో తరచుగా వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో బోల్డ్ ఇమేజ్ తెచ్చుకున్న సురేఖా వాణి షాకింగ్ లుక్ వైరల్ అవుతుంది. సురేఖావాణి గుండు చేయించుకుంది. ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మొక్కులో భాగంగా తలనీలాలు అర్పించారు.
తిరుమలలో కూతురితో పాటు సురేఖా వాణి కనిపించారు. సురేఖావాణి గుండు చేయించుకోవడం చర్చకు దారి తీసింది. ఇక సురేఖా వాణి కూతురు సుప్రీత కూడా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉంది. ఆమె ను లక్షల్లో ఫాలో అవుతున్నారు. సురేఖా వాణి సుప్రీతను హీరోయిన్ చేయాలి అనుకుంటుంది. అందుకే ఆమెతో గ్లామరస్ ఫోటో షూట్స్ చేయిస్తుంది. సురేఖా వాణి ప్రయత్నాలు ఎంత వరకు సక్సెస్ అవుతాయో చూడాలి..