Homeఎంటర్టైన్మెంట్World of Manamey Teaser: మనమే టీజర్ రివ్యూ: షాంపైన్ తాగాలంటున్న శర్వా... మేటర్ చాలా...

World of Manamey Teaser: మనమే టీజర్ రివ్యూ: షాంపైన్ తాగాలంటున్న శర్వా… మేటర్ చాలా కొత్తగా ఉందే!

World of Manamey Teaser:  హీరో శర్వానంద్ హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. 2017లో విడుదలైన మహానుభావుడు అనంతరం శర్వానంద్ కి హిట్ లేదు. శర్వానంద్ గత చిత్రం ఒకే ఒక జీవితం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కమర్షియల్ గా మాత్రం ఆడలేదు. దీంతో ఆయన కమ్ బ్యాక్ ఇవ్వాలి అనుకుంటున్నాడు. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తో 35వ చిత్రం చేస్తున్నాడు. నేడు శర్వానంద్ బర్త్ డే నేపథ్యంలో టీజర్ విడుదల చేశారు. అలాగే టైటిల్ ప్రకటించారు. ఈ చిత్రానికి మనమే అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

లండన్ నగరాన్ని టీజర్ లో ఆవిష్కరించారు. లండన్ లోని ఐకానిక్ ప్లేసెస్ చూపించారు. మరి లండన్ నగరంతో సినిమాకు ఉన్న కనెక్షన్ ఏమిటో తెలియాల్సి ఉంది. టీజర్ చివర్లో శర్వానంద్… ఇది షాంపైన్ తాగే సమయం అంటూ డైలాగ్ చెప్పాడు. శర్వానంద్ సెలబ్రేషన్ మూడ్ లో ఉన్నాడని ఆ డైలాగ్ ని బట్టి అర్థం అవుతుంది. అలాగే హీరోయిన్ గా నటిస్తున్న కృతి శెట్టిని కూడా పరిచయం చేశారు.

శర్వానంద్ లుక్ ఆకట్టుకుంది. అలాగే కృతి శెట్టి హోమ్లీ లుక్ లో అలరించింది. శర్వానంద్, కృతి కెరీర్లో మొదటిసారి జతకడుతున్నారు. వీరిద్దరికీ హిట్ కావాల్సి ఉంది. కృతి శెట్టి సైతం వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతుంది. కృతి శెట్టి నటించిన వారియర్, మాచర్ల నియోజకవర్గం పరాజయం పాలయ్యాయి. నాగ చైతన్యతో చేసిన కస్టడీ చిత్రంపై ఆమె చాలా ఆశలు పెట్టుకుంది. ఫలితం మాత్రం దక్కలేదు.

మనమే చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. గతంలో ఆయన భలే మంచి రోజు, శమంతకమణి, దేవదాసు, హీరో చిత్రాలకు దర్శకత్వం వహించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో మూవీ తెరకెక్కుతుంది. హేష్మా అబ్దుల్ వాహబ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. విక్రమ్ ఆదిత్య కీలక రోల్ చేస్తున్నాడు. మనమే చిత్ర టీజర్ ఆకట్టుకున్న నేపథ్యంలో అంచనాలు పెరిగాయి. సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది.

RELATED ARTICLES

Most Popular