https://oktelugu.com/

Sharwanand’s wedding : జైపూర్ లో ఘనంగా శర్వానంద్ పెళ్లి వేడుకలు…రామ్ చరణ్ హాజరు

జనవరిలో నిశ్చితార్థం జరగ్గా శర్వానంద్- రక్షిత రెడ్డి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారు. ఇందుకు రాజస్థాన్ లోని లీలా ప్యాలస్ ఎంచుకున్నారు. ఇక్కడ రెండు రోజులు శర్వానంద్-రక్షిత రెడ్డిల వివాహం జరిగింది.

Written By:
  • NARESH
  • , Updated On : June 4, 2023 / 07:57 PM IST
    Follow us on

    -హాజరైన చిన్ననాటి మిత్రుడు షాద్ నగర్ బిజేపి నేత ఏపీ మిథున్ రెడ్డి దంపతులు

    -మెగా పవర్ స్టార్ హీరో రామ్ చరణ్ హాజరు !

    Sharwanand’s wedding : హీరో శర్వానంద్ ఓ ఇంటివాడు అయ్యాడు. జైపూర్ లో శర్వానంద్ వివాహం ఘనంగా జరిగింది. తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె అయిన రక్షిత రెడ్డిని శర్వానంద్ పెళ్ళి చేసుకున్నారు. రక్షిత ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, దివంగత టీడీపీ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి మనవరాలు కూడాను. జైపూర్ లో జరిగిన ఈ వివాహ వేడుకకు చిన్ననాటి మిత్రుడు షాద్ నగర్ బిజేపి నేత ఏపీ మిథున్ రెడ్డి, రిషిక దంపతులు, మెగా పవర్ స్టార్ హీరో రామ్ చరణ్ తో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

    జనవరిలో నిశ్చితార్థం జరగ్గా శర్వానంద్- రక్షిత రెడ్డి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారు. ఇందుకు రాజస్థాన్ లోని లీలా ప్యాలస్ ఎంచుకున్నారు. ఇక్కడ రెండు రోజులు శర్వానంద్-రక్షిత రెడ్డిల వివాహం జరిగింది. మెహందీ, సంగీత్, హల్దీ ఫంక్షన్స్ గ్రాండ్ గా ప్లాన్ చేశారు. ఈ వేడుకల్లో వీరు పాల్గొని చిన్ననాటి అనుభూతులను పంచుకున్నారు.

    కొత్త జంటతో పాటు ఫంక్షన్ లో ఆడిపాడారు. బంధు మిత్రుల నడుమ శర్వానంద్ వివాహ వేడుకలను ఎంతగానో ఆస్వాదిస్తున్నారు. శర్వానంద్-రక్షిత రెడ్డిల వివాహా ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..