Sharwanand Upcoming Movies: ఒకప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ ప్రామిసింగ్ హీరో గా, నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) తో సమానంగా మార్కెట్ ని మైంటైన్ చేస్తూ, భవిష్యత్తులో ఈ ఇద్దరి హీరోల మధ్య పోటీ మామూలు రేంజ్ లో ఉండదు అని అనిపించే స్థాయిలో ఒక బ్రాండ్ ని ఏర్పాటు చేసుకున్న హీరో శర్వానంద్(Sharwanand). కెరీర్ ప్రారంభం క్యారక్టర్ రోల్స్ ద్వారా మన ఆడియన్స్ కి పరిచయమై, ఆ తర్వాత మెల్లగా హీరో పాత్రలు చేస్తూ, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ని తెచ్చుకున్నాడు. అలా కెరీర్ పీక్ రేంజ్ లోకి వెళ్తున్న సమయం లోనే వరుసగా ఫ్లాప్స్ రావడం, శర్వానంద్ మార్కెట్ బాగా దెబ్బ తినడం జరిగింది. రీసెంట్ గా ఆయన నుండి విడుదలైన సినిమాలన్నీ ఫ్లాప్స్ గా నిలిచాయి. ఆయన లేటెస్ట్ చిత్రం ‘మనమే’ కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యింది.
ఈ సినిమాకు ముందు విడుదలైన ‘ఒకే ఒక జీవితం’ చిత్రానికి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది కానీ, కమర్షియల్ గా పెద్ద రేంజ్ కి వెళ్ళలేదు. ఈ సినిమా ముందు విడుదలైన మహా సముద్రం, ఆడవాళ్లు మీకు జోహార్లు, శ్రీకారం,జాను ఇలా ప్రతీ సినిమా ఒక దానిని మించి ఒకటి ఫ్లాప్ అవుతూ శర్వానంద్ మార్కెట్ ని పూర్తిగా పాతాళ లోకంలోకి తొక్కేశాయి. ఆయన నుండి విడుదలైన చివరి సూపర్ హిట్ చిత్రం ‘మహానుభావుడు’. ఆ తర్వాత 8 సినిమాలు చేస్తే 7 ఫ్లాప్ అయ్యాయి. ఈ రేంజ్ ఫ్లాప్స్ వస్తే సూపర్ స్టార్స్ ని సైతం పట్టించుకోని రోజులివి, ఇక శర్వానంద్ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అయినప్పటికీ ఈయన డబుల్ డిజిట్ రెమ్యూనరేషన్ ని ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నాడట. ప్రస్తుతం ఇతని చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఒకటి ‘సామజవరగమనా’ ఫేమ్ రామ్ అబ్బరాజు తో చేస్తున్న ‘నారి నారి నడుమ మురారి’, మరొకటి ‘లూసర్’ ఫేమ్ అభిలాష్ రెడ్డి దర్శకత్వం లో యూవీ కిరియేషన్స్ బ్యానర్ లోని సినిమా.
Also Read: రూ.15వేల కోట్ల పటౌడీల ఆస్తి ప్రభుత్వపరం: సైఫ్ అలీఖాన్ కుటుంబానికి ఎదురుదెబ్బ, చరిత్ర చూస్తే..
ఈ రెండు కాకుండా సంపత్ నంది దర్శకత్వం లో ‘భోగి’ అనే చిత్రాన్ని కూడా ప్రకటించారు. ఈ సినిమాకు రాధామోహన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. రీసెంట్ గానే రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టుకొని రెండు షెడ్యూల్స్ ని కూడా పూర్తి చేసుకుంది ఈ చిత్రం. కానీ నిర్మాత రాధ మోహన్ గత చిత్రం ‘భైరవం’ కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అవ్వడంతో డబ్బులు లేక ఈ సినిమాని ఆపేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అదే విధంగా మిగిలిన రెండు సినిమాలకు కూడా అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ అవ్వడం తో ప్రస్తుతానికి ఆగిపోయాయట. శర్వానంద్ మార్కెట్ బాగా పడిపోవడం తో ఫైనాన్షియర్స్ ఒక లిమిట్ ని దాటి బడ్జెట్ ఇచ్చేందుకు అసలు ఒప్పుకోవడం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. ఇవన్నీ చూస్తుంటే ఇక శర్వానంద్ నుండి సినిమాలు విడుదల అవ్వడం కష్టమే అని అనిపిస్తుంది.