Sharwanand Biker Movie: ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసినా కూడా యంగ్ హీరోలు చేస్తున్న సినిమాలతో మంచి విజయాలను సాధిస్తున్నారు. శర్వానంద్ లాంటి హీరో ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు అవుతున్నప్పటికి ఇప్పటివరకు ఆయనకు సరైన సక్సెస్ రావడం లేదు. గతంలో రన్ రాజా రన్ లాంటి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నప్పటికి ఆ సినిమా తర్వాత ఆయనకు ఆశించిన విజయాలైతే దక్కలేదు. కెరియర్ స్టార్టింగ్ లో వెన్నెల, ప్రస్థానం లాంటి సినిమాల్లో డిఫరెంట్ పాత్రలను పోషించిన ఆయన ఆ తర్వాత మాత్రం అలాంటి పాత్రలు చేయడం లేదు. అతను కూడా కమర్షియల్ జానర్ లోనే పడిపోయి డిఫరెంట్ కథలను మర్చిపోయాడు అంటు కొంతమంది విమర్శలు చేశారు. కానీ ప్రస్తుతం బైకర్ సినిమాతో మరోసారి డిఫెరెంట్ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీతో తను మంచి విజయాన్ని సాధిస్తే మాత్రం మరోసారి మార్కెట్ విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి…
బైకర్ సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ సాధిస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో రాజశేఖర్ కూడా కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు. ఆ పాత్ర ఏంటి అనే విషయంలో సరైన క్లారిటీ రావడం లేదు. కానీ శర్వానంద్ ఈ సినిమాలో రాజశేఖర్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని రీసెంట్గా జరిగిన ఒక ఈవెంట్లో తెలియజేశాడు.
మొత్తానికైతే రాజశేఖర్ ఈ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ను గ్రాండ్ గా స్టార్ట్ చేయబోతున్నాడనే విషయమైతే చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఈ సినిమాతో కనుక విజయాన్ని సాధించి రాజశేఖర్ క్యారెక్టర్ కి గొప్ప గుర్తింపు వస్తోంది. తను కూడా చాలా బిజి ఆర్టిస్ట్ గా మారే అవకాశాలైతే ఉన్నాయి. ఇక శర్వానంద్ ఇంతకుముందు చేసిన ‘మనమే’ సినిమా భారీ డిజాస్టర్ ను ని మూటగట్టుకుంది.
మరోసారి తనను తాను ఎలివేట్ చేసుకోవాలంటే మాత్రం ఈ సినిమా సక్సెస్ ని సాధించాల్సిన అవసరమైతే ఉంది…ఇక శర్వానంద్ మాదిరిగానే యంగ్ హీరోలు సైతం డిఫరెంట్ సినిమాలు చేస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీ మరింత ముందుకు దూసుకెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి…