Oke Oka Jeevitham Collections: విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను ఎప్పుడు మైమరపించే హీరోలలో ఒకరు శర్వానంద్..అద్భుతమైన టాలెంట్ ఉన్న శర్వానంద్ ఇప్పటికి స్టార్ లీగ్ లోకి రాలేకపోవడం అతని దురదృష్టం అనే చెప్పాలి..వరుసగా హిట్లు కొడుతూ కెరీర్ లో జెట్ స్పీడ్ గా వెళ్తున్న శర్వానంద్ కెరీర్ ఇప్పుడు వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో నెట్టుకొస్తోంది..శర్వానంద్ సినిమా అంటేనే నీరసం అనే ఫీలింగ్ లో వచ్చేసింది..అందుకే ఆయన సినిమా యావరేజి గా ఉన్నా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టేస్తున్నాయి..ఆయన గత చిత్రాలైన జాను, మహా సముద్రం మరియు ఆడవాళ్లు మీకు జోహార్లు వంటి సినిమాలకు యావరేజి టాక్ వచ్చినప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద దారుణమైన పరాజయాలను చవిచూశాయి..అలా వరుస డిజాస్టర్ ఫ్లాప్ సినిమాల తర్వాత ఆయన చేసిన ‘ఒకే ఒక జీవితం’ అనే సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై అద్భుతమైన పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది..కానీ ఇదే రోజు భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’ విడుదల అవ్వడం వల్ల ఆడియన్స్ మొదటి ఛాయస్ ఆ సినిమానే అయ్యింది.

బ్రహ్మాస్త్ర మూవీ ఓపెనింగ్స్ ఒకే ఒక జీవితం పై మొదటి ఆట నుండే పడింది..దాని వల్ల ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్క చోట కూడా హౌస్ ఫుల్ బోర్డు పడలేదు..శర్వానంద్ కెరీర్ లో ఇలా జరగడం ఇదే తొలిసారి..పాజిటివ్ టాక్ రావడం తో కొన్ని చోట్ల మార్నింగ్ షోస్ తో పోలిస్తే మ్యాట్నీ షోస్ పర్వాలేదు అనిపించింది, కానీ అది ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి ఉపయోగపడే ఓపెనింగ్ మాత్రం కాదనే చెప్పాలి.

ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి దాదాపుగా 7 కోట్ల 50 లక్షల రూపాయలకు జరిగింది..మొదటి రోజు ఈ సినిమాకి కోటి రూపాయలకు పైగా షేర్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి..టాక్ మొత్తం అదిరిపోయింది కాబట్టి ఈ సినిమా వీకెండ్ లో పుంజుకునే అవకాశం ఉందని ట్రేడ్ పండితుల అభిప్రాయం..ఒకవేళ వీకెండ్ లో ఈ సినిమా కావాల్సిన గ్రోత్ చూపించుకోలేకపోతే శర్వానంద్ కెరీర్ లో మరో డిజాస్టర్ ఫ్లాప్ పడినట్టే అని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి..చూడాలి మరి శర్వానంద్ లక్ మారి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందో లేదో అనేది.