Pawan Kalyan- Prabhas: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ మూవీస్ లో ఒకటి ప్రాజెక్ట్ K..మహానటి దర్శకుడు నాగ అశ్విన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా వైజయంతి మూవీ బ్యానర్స్ మీద సి.అశ్వినీదత్ మరియు ఆయన కుమార్తె స్వప్న కలిసి ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు..ఇండియన్ ఫిలిం ఇంస్ట్రీ హిస్టరీ లోనే చిరస్థాయిగా నిలిచిపొయ్యే సూపర్ హీరో క్యారక్టర్ ని ప్రభాస్ ఇందులో పోషిస్తున్నది ఇప్పటికే ఆ చిత్ర దర్శకుడు అశ్వినీదత్ గారు తెలిపారు..ఈ సినిమా లో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుండగా..బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు..ఈ సినిమా షూటింగ్ ని వచ్చే ఏడాది సమ్మర్ లోపు పూర్తి చేసి , 2023 అక్టోబర్ 23 వ తారీఖున ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని బాషలలో ఘనంగా విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

ఇది ఇలా ఉండగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో లీక్ అయ్యి తెగ వైరల్ గా మారింది..అదేమిటి అంటే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతున్నా సమయం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెట్స్ కి వచ్చినట్టు తెలుస్తుంది..పవన్ కళ్యాణ్ కి చిన్నతనం నుండి అమితాబ్ బచ్చన్ అంటే ఎలాంటి అభిమానం అనే సంగతి మన అందరికి తెలిసిందే..ఆయనతో చిన్న సెల్ఫీ దిగినా సాధారణ అభిమాని లాగ మురిసిపోతుంటాడు పవన్ కళ్యాణ్..ప్రాజెక్ట్ K షూటింగ్ జరుగుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ అమితాబ్ బచ్చన్ గారిని కలవడం కోసం సెట్స్ కి వెళ్లారట..

అక్కడ అమితాబ్ బచ్చన్ తో పాటుగా ప్రభాస్ మరియు దీపికా పదుకొనె కూడా ఉన్నారు..చాలా సేపు వీళ్ళ మధ్య చర్చ జరిగిన తర్వాత లంచ్ కార్యక్రమం పూర్తి చేసి ప్రాజెక్ట్ K సెట్స్ నుండి తిరిగి వెళ్లారట పవన్ కళ్యాణ్..అతి త్వరలోనే ఈ వీడియో ని సోషల్ మీడియా లో విడుదల చెయ్యబోతుందట మూవీ టీం..మరి ప్రభాస్ , పవన్ కళ్యాణ్ మరియు అమితాబ్ బచ్చన్ ని ఒక్కే ఫ్రేమ్ లో చూసే అభిమానులకు ఈ వీడియో ఎంత కనులపండుగగా ఉంటుందో ఊహించుకోవచ్చు.