Sharwanand: ఓ చిన్న స్థాయి నటుడిగా కెరీర్ ప్రారంభించిన శర్వానంద్ తనకంటూ ఓ ఇమేజ్ సాధించాడు. టైర్ టూ హీరోల లిస్ట్ లో చేరాడు. ఆయన నటించిన గమ్యం, రన్ రాజా రన్, జర్నీ, ప్రస్థానం, శతమానం భవతి, మహానుభావుడు మంచి విజయాలు సాధించాయి. ఆయనకు టాలీవుడ్ లో మార్కెట్ ఏర్పరిచాయి. అయితే శర్వాపై ఎప్పటి నుండో ఓ పుకారు ఉంది. ఆయన రెమ్యునరేషన్ విషయంలో గట్టిగా ఉంటారు. నిర్మాతలను డిమాండ్ చేస్తారనే వాదన ఉంది. ఈ విషయంపై తాజాగా శర్వానంద్ స్పందించారు. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న శర్వానంద్ డబ్బులు కోసం సినిమాలు చేయాల్సిన అవసరం తనకి లేదన్నాడు.
సినిమా ఆడని సందర్భాల్లో రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే నా మార్కెట్ విలువ ప్రకారం తీసుకోవడంలో వెనుకాడను. అది నాకు నేను ఇచ్చుకునే విలువ. అడిగింది నిర్మాతలు ఇస్తున్నారంటే నాకు అంత వర్త్ ఉండబట్టే కదా. అందులోనూ నేను పెద్ద నిర్మాణ సంస్థల్లో చేశాను. చిన్న ప్రొడ్యూసర్స్ ని అలా డిమాండ్ చేయలేదు. అతిశయోక్తిగా ఉంటుంది కానీ… కేవలం డబ్బుల కోసం సినిమాలు చేయాల్సి అవసరం లేదు. ఎందుకంటే నా సినిమాలు నేను ప్రొడ్యూస్ చేసుకోగలను. ఆ కెపాసిటీ నాకుంది, అని శర్వా అన్నారు.
Also Read: India vs Pakistan Asia Cup: ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్.. ఎవరికి గెలిచే ఛాన్స్ ఎక్కువ?
ఆ మాటకు ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి.. అవును ఓ డైరెక్టర్ నాతో చెప్పారు. హైదరాబాద్ లో మూడొంతులు మీదేనట. ఏ ఏరియాకు వెళ్లినా అక్కడ ఓ స్థలం మాదే అంటూ చూపించేవారట, అని అన్నారు. దానికి.. అయ్యో అంత కాదు కానీ, అమ్మా నాన్న బాగానే సంపాదించారు. అయితే నాకు 19 ఏళ్ల వయసు వచ్చాక పేరెంట్స్ ని ఒక్క రూపాయి అడగలేదు. అలాగే మా పేరెంట్స్ కూడా మేము సంపాదించాం కదా, పిల్లలు పని చేయకుండా పెరగాలని కోరుకోరు. ఎవరి కెరీర్ వాళ్ళు చూసుకోవాలి అంటారు. మేము ముగ్గురం పిల్లలం ఎవరి ప్రొఫెషన్ లో వాళ్ళం బిజీగా ఉన్నామని శర్వా చెప్పారు.ఇక తెరపై చాలా సింపుల్ గా కనిపించే శర్వా రేంజ్ ఇదా అని, ఇంటర్వ్యూ చూసినవాళ్లు నోరెళ్లబెడుతున్నారు. ఇక వరుస పరాజయాలతో సతమతమవుతున్న శర్వా ప్రస్తుతం ఒకే ఒక జీవితం టైటిల్ తో బైలింగ్వెల్ మూవీ చేస్తున్నారు.
Also Read:Anchor Anasuya Bharadwaj: ట్విట్టర్ వార్: విజయ్ దేవరకొండ అభిమానులను హెచ్చరించిన అనసూయ