Sharwanand New Look: మంచి టాలెంట్ ఉన్నప్పటికీ ఇండస్ట్రీ లో అనుకున్నంత స్థాయికి వెళ్లలేకపోయిన హీరోలలో ఒకడు శర్వానంద్(Sharwanand). క్యారక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ని మొదలు పెట్టి, ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో హీరో గా నటించి, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ని అయితే తెచ్చుకోగలిగాడు కానీ, ఒక మంచి కమర్షియల్ హీరో గా మాత్రం నిలబడలేకపోయాడు. ప్రస్తుతం శర్వానంద్ సినిమా థియేటర్స్ లోకి వస్తుందంటే, ఏమి చూస్తాములే, నీరసంగా ఉంటాయి అనే ఫీలింగ్ ఆడియన్స్ లో కలుగుతోంది. దీనివల్ల ఆయన సినిమాలకు కనీస స్థాయిలో కూడా బజ్ ఏర్పడడం లేదు. ‘మనమే’ చిత్రం తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న శర్వానంద్, ఈ సంక్రాంతికి ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రం తో మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా తో ఆయన భారీ కం బ్యాక్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.
ఇదంతా పక్కన పెడితే శర్వానంద్ ‘బైకర్’ అనే భారీ బడ్జెట్ చిత్రం లో కూడా నటిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేశారు. దీనికి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఈ సినిమా కోసం శర్వానంద్ ప్రాణం పెట్టి పని చేస్తున్నాడు. అంటే స్టోరీ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కెరీర్ లో ఇప్పటి వరకు ఎప్పుడూ చేయని విధంగా వర్కౌట్స్ చేసి ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ బాడీ ని పెంచాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అబ్బో శర్వానంద్ లో ఇంత మేక్ ఓవర్ అయ్యే కెపాసిటీ ఉందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా లో వైరల్ అయిన ఈ ఫోటోలలో శర్వానంద్ హాలీవుడ్ హీరో కి ఏ మాత్రం తీసిపోని విధంగా ఉన్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ చిత్రానికి అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఆయనకు ఇదే తొలిసినిమా. ఒక కొత్త దర్శకుడుని నమ్మి శర్వానంద్ ఇంత హార్డ్ వర్క్ చేయడం , నిర్మాతలు 50 కోట్లకు పైగా బడ్జెట్ ని ఖర్చు చేయడానికి ముందుకు రావడం వంటివి చూస్తుంటే, ఈ సినిమా కథ, స్క్రీన్ ప్లే చాలా చక్కగా కుదిరినట్టు అనిపిస్తోంది. మధ్యలో బడ్జెట్ కారణాల వల్ల కొంతకాలం ఈ సినిమా షూటింగ్ కూడా ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఒడిదుడుగులను దాటుకొని ఈ చిత్రాన్ని ఇప్పుడు చివరి దశకు తీసుకొచ్చారు. ఇందులో హీరోయిన్ గా మాళవిక నాయర్ నటిస్తుంది. అతుల్ కులకర్ణి కీలక పాత్ర పోషించాడు.