Sharwanand Career Downfall Reasons: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకు వస్తారు. వాళ్ళు చేస్తున్న సినిమాలు ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకుంటున్నాయి. ఇక ‘న్యాచురల్ స్టార్ నాని’ లాంటి హీరోకి సైతం ప్రస్తుతం ప్రత్యేకమైన క్రేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఇప్పటివరకు నాని సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇప్పుడు సాధించబోయే విజయాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. కారణం ఏంటి అంటే ఆయన నుంచి వచ్చే ప్రతి సినిమా విషయంలో ఆయన కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక నాని కంటే ముందే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి హీరోగా అవతరించిన నటుడు శర్వానంద్… ప్రస్తుతం నాని ఉన్న పొజిషన్ లో శర్వానంద్ ఉండాలి. కానీ తను చేసిన సినిమాల వల్ల ఆయన పూర్తిగా డౌన్ ఫాల్ అయిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కెరియర్ స్టార్టింగ్ లో హీరోగా తనకు మంచి అవకాశాలు వచ్చాయి. అయినప్పటికి తను ఆచితూచి మరీ క్యారెక్టర్ లను ఎంచుకొని సక్సెస్ లను సాధించాడు.
Also Read: యంగ్ హీరోల కొత్త మెకోవర్ వెనక ఉన్న అసలు కారణం ఇదేనా..?
గమ్యం, ప్రస్థానం లాంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ సక్సెస్ లను సాధించిన కూడా ఆయన ఆ తర్వాత చేసిన సినిమాల విషయంలో పెద్దగా కేర్ తీసుకోలేకపోయాడు. దానివల్లే ఆయన సినిమాలు వచ్చినవి వచ్చినట్టుగా ఫ్లాప్ అయ్యాయి. దాంతో ఏం చేయాలో తెలియని దిక్కుతోచని పరిస్థితిలో శర్వానంద్ ఇప్పుడు మరోసారి తన కెరియర్ ను సెట్ చేసుకుంటూ వస్తున్నాడు.
రీసెంట్ గా ‘నారి నారి నడుమ మురారి’ సినిమాతో సక్సెస్ ను అందుకున్నాడు. ప్రస్తుతం ‘భోగి’ సినిమాతో మాస్ అవతారం ఎత్తనున్నాడు. సంపత్ నంది డైరెక్షన్ లో తెరకెక్కతున్న ఈ సినిమా ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ రాబట్టుకుంటుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది.
మొత్తానికైతే శర్వానంద్ సైడ్ ట్రాక్ వెళ్లడం వల్లే నాని తో పోటీపడే హీరోలు ఎవరు లేక నాని టాప్ రేంజ్ లోకి వెళ్ళిపోతున్నాడు. శర్వానంద్ ఒకప్పుడు గొప్ప నటుడిగా విమర్శకుల నుంచి ప్రశంసలను అందుకున్నాడు. అలాంటి నటుడు ప్రస్తుతం తన సినిమాలతో ఇండస్ట్రీలో ఎలాంటి మ్యాజిక్ చేయకపోవడంతో అతని అభిమానులు సైతం తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు…