హీరో శర్వానంద్ ది మొదటి నుండి విభిన్నమైన శైలి. అందరి హీరోల లాగా రెగ్యులర్ సినిమాలు చేయడం, ఎదో నాలుగు ఫైట్ సీన్స్, పది కామెడీ సీన్స్ చేసి వెళ్లిపోవడం మనోడికి అసలు నచ్చదు. ఏది చేసినా కొత్తగా ఉండాలని ఎప్పటికప్పుడు ఆరాటపడుతుంటాడు. అందుకే, ఈ జనరేషన్ లో శర్వా వేసినన్నీ వైవిధ్యమైన పాత్రలు మరో ఏ హీరో వేయలేదు అంటే.. అతిశయోక్తి కాదు. అంతగా తనను తానూ కొత్తగా ఆవిష్కరించుకున్నాడు శర్వానంద్.
Also Read: ఎన్టీఆర్ కార్ల ప్రేమ.. మరో 5 కోట్ల కారు బుక్.. విశేషాలివీ..
అయితే ఈ హీరో మరోసారి ఖాకీ చొక్కా వేసుకోబోతున్నాడు. ఇప్పటికే “రాథ” అనే ప్లాప్ సినిమాలో కామెడీ కాప్ గా కనిపించి అలరించాడు. కానీ ఆ సినిమా పెద్ద డిజాస్టర్ అయింది. అందుకే ఈ సారి మాత్రం ఫుల్ లెంగ్త్ సీరియస్ పోలీస్ క్యారెక్టర్ వేయబోతున్నాడట. ఈ మేరకు దర్శకుడు సుజీత్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తోన్న రామ్ అనే కొత్త దర్శకుడికి శర్వా ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది.
కొత్త డైరెక్టర్ రామ్ చెప్పిన స్టోరీలైన్ శర్వాకు చాల బాగా నచ్చిందట. సినిమా మొత్తం సీరియస్ గా ఉంటుందని.. పోలీస్ స్టోరీ అయినప్పటికీ చాలా కొత్తగా ఉంటుందని.. తన కెరీర్ లోనే ఇలాంటి సినిమా ఎప్పుడూ చేయలేదని శర్వా తన సన్నిహితుల దగ్గర చెబుతున్నాడట.
Also Read: కెరీర్ ను నాశనం చేసుకుంటున్న టాలెంటెడ్ బ్యూటీ !
మరి శర్వానంద్ లాంటి భిన్నమైన హీరోనే ఈ రేంజ్ లో ఒక కథను పొగుడుతున్నాడు అంటే.. మరి ఆ కథ ఏ రేంజ్ లో బాగుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ సినిమా బ్యానర్ ఇంకా ఫిక్స్ అవ్వాల్సి ఉంది. అలాగే, ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందనేది కూడా ఇంకా క్లారిటీ రావాలి. ప్రస్తుతం శ్రీకారం సినిమా బిజీలో ఉన్నాడు శర్వా. అలాగే తెలుగు-తమిళ భాషల్లో చేస్తున్న ఓ ద్విభాషా సినిమాని కూడా త్వరగా పూర్తి చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్