ఎన్టీఆర్ కార్ల ప్రేమ.. మరో 5 కోట్ల కారు బుక్.. విశేషాలివీ..

టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ కు కార్లు అన్నా.. వాటి నంబర్లు అన్నా తెగ ఇష్టం. ఆయన ఇష్టపడి కొనే కార్లకు ‘9’ నంబర్ ను వేలంలో ఎంత వెచ్చించి అయినా కొంటుంటారు. హైదరాబాద్ లో అప్పట్లో దక్కకపోతే ఆదిలాబాద్ జిల్లా నుంచి కొని విమర్శలు కొనితెచ్చుకున్నాడు. Also Read: కెరీర్ ను నాశనం చేసుకుంటున్న టాలెంటెడ్ బ్యూటీ ! ఆ తర్వాత కార్లను కొనడం.. నంబర్ల కోసం పాటు పడడాన్ని ఎన్టీఆర్ తగ్గించుకున్నాడు. ఒకప్పుడు ఏడాదికి […]

Written By: NARESH, Updated On : March 2, 2021 6:02 pm
Follow us on

టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ కు కార్లు అన్నా.. వాటి నంబర్లు అన్నా తెగ ఇష్టం. ఆయన ఇష్టపడి కొనే కార్లకు ‘9’ నంబర్ ను వేలంలో ఎంత వెచ్చించి అయినా కొంటుంటారు. హైదరాబాద్ లో అప్పట్లో దక్కకపోతే ఆదిలాబాద్ జిల్లా నుంచి కొని విమర్శలు కొనితెచ్చుకున్నాడు.

Also Read: కెరీర్ ను నాశనం చేసుకుంటున్న టాలెంటెడ్ బ్యూటీ !

ఆ తర్వాత కార్లను కొనడం.. నంబర్ల కోసం పాటు పడడాన్ని ఎన్టీఆర్ తగ్గించుకున్నాడు. ఒకప్పుడు ఏడాదికి ఒక కారును మార్చేసే ఎన్టీఆర్ ఆ ఇన్సిడెంట్ తర్వాత కారును మార్చడం లేదు.

తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో భీం నటించడం.. ప్యాన్ ఇండియా స్టార్ గా మారుతున్న వేళ ఒక ఖరీదైన కారును ఎన్టీఆర్ కొన్నారు. అది అలాంటి ఇలాంటి కారు కాదు.. స్పోర్ట్స్ కారు.

ఇటలీ దేశంలో తయారైన అత్యంత విలాసవంతమైన స్పోర్ట్స్ కారు ‘లంబోర్ఘిని’ ఉరుస్ మోడల్ ను ఎన్టీఆర్ బుక్ చేశాడు. దీని ఖరీదు అక్షరాల సుమారు 5 కోట్లు అంట..

Also Read: ‘లేడీ సూపర్ స్టార్’ పెళ్లికి డేట్ ఫిక్స్ !

సూపర్ స్పోర్ట్స్ కారు అయిన ఇది కొండ ప్రాంతాలు, ఏడారి ఇసుకలో సైతం పరుగులు తీయగలదట.. ఏ ఏరియాలోనూ ఆగకుండా పోగలదట.. ఎన్నో ప్రత్యేకతలు..ప్రమాదాలు జరిగినా ఏం కాని రక్షణ వ్యవస్థలున్నా ఈ కారును ముచ్చటపడి మరీ ఎన్టీఆర్ కొంటున్నారట..

ఎన్టీఆర్ ఇప్పటికే కార్ల మోజులో కొత్త మోడల్స్ అన్నింటిని కొనేస్తున్నాడని.. తాజాగా ఏకంగా రూ.5 కోట్లు పెట్టిన కారు ఎలా ఉంటుందోనని టాలీవుడ్ లో అందరూ గుసగుసలాడుకుంటున్నారు. దీనిపై ఎన్టీఆర్ నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్