
Sharwanand Siddharth Movie: హీరో శర్వానంద్ – సిద్ధార్థ్ లు ఎంతో ఇష్టపడి కష్టపడి చేసిన సినిమా ‘మహా సముద్రం’. ఈ సినిమా బాక్సాఫీస్ ముగిసింది. లెక్కలన్నీ తెప్పించుకుని చూసుకున్నాక, నిర్మాత అనిల్ సుంకరకు కన్నీళ్లు ఒక్కటే కరువయ్యాయి. జీవితంలో నాకు ఇక హిట్ రాదా ? నేను ఏమి చేసినా ఎందుకు ఫెయిల్ అయిపోతున్నాను అంటూ అనిల్ సుంకర పూర్తి నిరాశ లోకి వెళ్లిపోయి బాధగా విచారిస్తున్నాడట.
మరోపక్క సిద్ధార్థ్ కూడా ఈ సినిమా తనకు గొప్ప విజయాన్ని ఇస్తోందని.. తెలుగులో మళ్ళీ తనకు మార్కెట్ వస్తోందని బాగా ఆశ పడ్డాడు. కట్ చేస్తే.. ఈ సినిమా ప్లాప్ దెబ్బకు సిద్ధార్థ్ ఇప్పట్లో మళ్ళీ తెలుగు తెర వైపు చూసే ధైర్యం కూడా చేసే పరిస్థితుల్లో లేడు. ఇక అందరి కంటే ఎక్కువ భంగ పడింది మాత్రం శర్వానందే. ఈ సినిమాతో తన ఖాతాలో గొప్ప హిట్ వచ్చేసిందని నమ్మాడు.
దానికి కారణం దర్శకుడు అజయ్ భూపతినే. రాజమౌళి కూడా అజయ్ అంతా ఓవర్ డైలాగ్స్ ఎన్నడూ పేలలేదు. కానీ అజయ్ మాత్రం తానూ గొప్ప సినిమా తీశాను అంటూ అనవసరమైన బిల్డప్ లకు పోయాడు. అసలు ఈ కథను చాలా మంది హీరోలు రిజక్ట్ చేశారు. రవితేజ దగ్గర నుంచి నాని, రామ్, నితిన్.. చివరకు నాగచైతన్య కూడా ఈ సినిమాను రిజక్ట్ చేశాడు.
తన కథను రిజెక్ట్ చేసినందుకు రవితేజ పై అజయ్ చీప్ స్టార్ అంటూ విమర్శలు కూడా చేశాడు. మొత్తానికి అజయ్ స్థాయి పడిపోయింది. కథ చెబుతాను అని ఫోన్ చేస్తే.. కనీసం ఏ హీరో స్పందించట్లేదట. ఇక నిర్మాతలు అయితే.. లేదమ్మా మళ్ళీ చూద్దాం అంటూ అజయ్ ను పక్కన పెడుతున్నారు. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ కొడుతుందని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అజయ్ భూపతి చాలా బలంగా ఓవర్ గా చెప్పాడు.
అయితే, సినిమా చూసాక, అతని పై అందరికీ నమ్మకం పోయింది. ఈ సినిమా విడుదలైన తొలిరోజునే ఫ్లాప్ టాక్ తెచ్చుకుని.. నిర్మాతకు భారీ నష్టాలను మిగిల్చింది. హిట్ కోసం ఎంతగానో ఎదురుచూసిన శర్వానంద్- సిద్ధార్థ్ లకు బాధను మిగిల్చింది.
Also Read: ఆడవాళ్ళు మీకు జోహార్లు అంటున్న … శర్వానంద్