Shanmukh Jaswanth- Deepthi Sunaina: షణ్ముఖ్ జస్వంత్-దీప్తి సునైన విడిపోయి ఏడాది దాటిపోయింది. బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొన్న షణ్ముఖ్ తోటి కంటెస్టెంట్ సిరి హన్మంత్ తో రొమాన్స్ చేశాడు. ఫ్రెండ్ పేరుతో వీరు హౌస్లో ప్రేమాయణం నడిపారు. సిరి పట్ల షణ్ముఖ్ చాలా పొసెసివ్ గా ఉండేవాడు. హౌస్లో మరో కంటెస్టెంట్ తో సిరి మాట్లాడితే తట్టుకునేవాడు కాదు. మానసికంగా సిరిని షణ్ముఖ్ బాగా వేధించాడు. అప్పుడప్పుడు సిరి కోపంగా బాత్ రూమ్ కి వెళ్లి ఏడ్చేది. తలను గోడకు బాదుకోబోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఎంత తిట్టుకున్నా మరలా కలిసిపోయే వారు.

ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయిన వీరి వ్యవహారం బిగ్ బాస్ షోకి హైలెట్ అయ్యింది. ఇక హౌస్లో ఉన్న షణ్ముఖ్ ని కలిసేందుకు బిగ్ బాస్ వేదికపైకి సునైన వచ్చింది. అతనితో చాలా ప్రేమగా మాట్లాడింది. దీంతో షణ్ముఖ్-సిరి సన్నిహితంగా ఉంటున్నారన్న విషయం తనని హర్ట్ చేయలేదని అందరూ భావించారు. షణ్ముఖ్ గెలుపుకోసం బయట దీప్తి పెద్ద ఎత్తున క్యాంపైన్ చేసింది. అయితే షణ్ముఖ్ రన్నర్ తో సరిపెట్టుకున్నాడు.
షో ముగిసి షణ్ముఖ్ బయటకు వచ్చాక బ్రేకప్ రూమర్స్ తెరపైకి వచ్చాయి. ఓ రోజు దీప్తి సునైన స్వయంగా అధికారిక ప్రకటన చేశారు. షణ్ముఖ్ తో విడిపోతున్నట్లు వెల్లడించారు. కారణాలు మాత్రం ఆమె చెప్పలేదు. సిరి కారణంగానే షణ్ముఖ్-దీప్తి మధ్య మనస్పర్థలు వచ్చాయంటూ ప్రచారం జరిగింది. ఈ పుకార్లపై సిరి కూడా స్పందించారు. ఆ వార్తలను కొట్టిపారేశారు. బ్రేకప్ తర్వాత ఎవరి దారిన వాళ్ళున్నారు.

సడన్ గా దీప్తి మాజీ ప్రియుడితో కలిసి సాంగ్ చేస్తున్నట్లు ప్రకటించారు. షణ్ముఖ్ నేను కలిసి ఒక ఆల్బమ్ చేస్తున్నాము. త్వరలో ఈ ఆల్బమ్ విడుదల కానుందని ప్రకటించింది. ఏడాది కాలంగా దూరంగా ఉంటున్న ఈ జంట కలిసి వీడియోలు చేస్తున్నామని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కలయిక కేవలం ప్రొఫెషన్ కోసమా లేక ప్రేమ కోసమా అర్థం కావడం లేదు. అయితే గత అనుభవాల రీత్యా నా జీవితం నా చేతిలోనే ఉంటుందని దీప్తి అన్నారు. నెక్స్ట్ సాంగ్ లో నాకు పెళ్లి అవుతుందా… కాదా?. మీరే చూడండి అంటూ సస్పెన్సు లోకి నెట్టింది.