Shanmukh And Siri: షణ్ముఖ్ జస్వంత్, సిరి హనుమంత్ ల మధ్య కెమిస్ట్రీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. బిగ్ బాస్ హౌస్ లో ఫుల్ క్రేజ్ తో బాగా ఎంటర్ టైన్ చేసిన ఈ క్రేజీ జంట.. ఇప్పుడు ‘క్విక్ ఫిక్షన్’ (Quick Fiction) అనే సిరీస్‌తో అనేక సర్ ప్రైజ్ లు మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఐతే.. ఇక్కడ మరో విశేషం కూడా ఉంది.

ఈ సిరీస్ లో కేవలం షణ్ముఖ్ జస్వంత్, సిరి మాత్రమే కాకుండా.. సిరి ప్రియుడు శ్రీహాన్ కూడా ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అదే విధంగా యూట్యూబర్స్ డాన్ పృథ్వీ, తేజ్ ఇండియా వీళ్లంతా ఈ ప్రాజెక్ట్ లో భాగస్వామ్యం అవుతున్నారు. మొత్తానికి నటీనటుల లిస్ట్ చూస్తే.. ఈ సిరీస్ పై ఆసక్తి కలుగుతుంది.
Also Read: Kohli Dance: సమంత ‘ఊ అంటావా మావా’ పాటకు ఊగిపోయిన విరాట్ కోహ్లీ.. వైరల్ వీడియో
మరి, స్టార్ మా మ్యూజిక్‌లో త్వరలో ప్రసారం కాబోతున్న ఈ ‘క్విక్ ఫిక్షన్’ (Quick Fiction) సిరీస్ ప్రోమో తాజాగా విడుదల అయ్యింది. ఈ ప్రోమోలో సిరి, షణ్ముఖ్, శ్రీహాన్‌లు కనిపించి సందడి చేశారు. ముఖ్యంగా శ్రీహాన్, సిరిలు భార్యా భర్తలుగా కనిపించి బాగా అలరించారు. మెయిన్ గా సిరి ఒరిజినాలిటీకి దగ్గరయ్యేట్టుగానే చాలా బాగా డైలాగ్‌లు రాశారు.
‘ఏజ్ గురించి నువ్వే చెప్పాల్రా బాబూ.. బ్యాక్ బెంచ్‌లో కూర్చుని చేయాల్సిన పనులన్నీ చేసేశావ్..’ అని పంచ్‌లు వేసింది. అదే విధంగా శ్రీహాన్ కూడా సిరికి భర్తగా అమాయకంగా కనిపించి వావ్ అనిపించాడు. మొగుడు అని చూడకుండా ఆఫీస్‌లో కుక్క చాకిరీ చేయిస్తుంది.. పక్క వాళ్లకి నీతులు బాగానే చెప్తారు మేడమ్’ అంటూ ఆడియన్స్‌కి వెంటనే కనెక్ట్ అయ్యే డైలాగ్ వేశాడు.

మొత్తమ్మీద సిరి గురించి చాలా బాగా పంచ్ లు వేశాడు శ్రీహాన్. ఇక షణ్ముఖ్ విషయానికి వస్తే.. అమ్మాయి ప్రపోజ్ గురించి మాట్లాడుతూ.. లవర్ బాయ్ అనిపించాడు. మొత్తానికి ఈ ప్రోమో అయితే సిరీస్‌పై ఆసక్తిని పెంచేసింది. మరి ఈ సిరీస్ ఏ స్థాయిలో హిట్ అవుతుందో చూడాలి.
ఈ ‘క్విక్ ఫిక్షన్’ సిరీస్ ప్రోమోలో మ్యాటర్ ఉండేసరికి.. ఈ సిరీస్ ప్రోమో టాప్ ట్రెండింగ్‌లో 44వ స్థానంలో ఉంది. ప్రేక్షకుల నుంచి అయితే ఈ ప్రోమోకి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ ప్రోమో చూసిన కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తూ.. ‘మేము అంతా షణ్ముఖ్ బాబు కోసం చాలా వెయిట్ చేస్తున్నాం’ అంటూ కామెంట్లు మోత మోగిస్తున్నారు.
Also Read:Ajay Devgn vs Sudeep: హిందీ భాష పై సూపర్ స్టార్లు మధ్య వార్ !
Recommended Videos: