https://oktelugu.com/

Shanmukh Jaswanth: నడవలేని స్థితిలో ‘వీల్ చైర్’ కి పరిమితమైన షణ్ముఖ్ జస్వంత్.. అసలు ఏమైంది?

ఇక ఆయన బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత ప్రేమించిన అమ్మాయి దీప్తి సునైనా బ్రేకప్ చెప్పేసింది. అప్పటి నుండి మనోడు సోషల్ మీడియా లో కొన్ని రోజులు యాక్టీవ్ గా లేడు. కానీ ఇప్పుడు మాత్రం ఫుల్ గా యాక్టీవ్ అయ్యాడు, రీసెంట్ గా ఆయన తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో వీల్ చైర్ లో కూర్చున్న ఫోటోని అప్లోడ్ చేసాడు.

Written By:
  • Vicky
  • , Updated On : June 9, 2023 / 06:29 PM IST

    Shanmukh Jaswanth

    Follow us on

    Shanmukh Jaswanth: షణ్ముఖ్ జస్వంత్..ఈ పేరు యూట్యూబ్ లో ఒక సెన్సేషన్, కవర్ సాంగ్స్ మరియు వెబ్ సిరీస్ లతో ఒక మీడియం రేంజ్ హీరోకి ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. ఆయన హీరో గా చేసిన ‘సాఫ్ట్ వేర్ డెవలపర్’ మరియు ‘సూర్య’ వెబ్ సిరీస్ లు యూట్యూబ్ లో రికార్డు స్థాయి వ్యూస్ ని సొంతం చేసుకుంది. బాయ్ టూ నెక్స్ట్ డోర్ తరహా పాత్రలు పోషిస్తూ ఆయన యూత్ కి ఎంతో చేరువ అయ్యాడు.

    అలా యూట్యూబ్ వెబ్ సిరీస్ ద్వారా వచ్చిన క్రేజ్ తో షణ్ముఖ్ కి బిగ్ బాస్ రియాలిటీ షో లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొనే ఛాన్స్ దక్కింది. ఆయన ఏ ముహూర్తం లో బిగ్ బాస్ లోకి అడుగుపెట్టాడో తెలియదు, ఉన్న ఫేమ్ కాస్త పొయ్యి తీవ్ర స్థాయి నెగటివిటీ ని కొని తెచ్చుకున్నాడు. హౌస్ లో ఉన్నన్ని రోజులు ఈయన సిరి తో కలిసి రొమాన్స్ చెయ్యడం, ఆమెతో ప్రేమాయణం నడపడం వంటివి యావత్తు తెలుగు రాష్ట్ర ప్రజలు తిట్టుకునేలా చేసింది.

    ఇక ఆయన బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత ప్రేమించిన అమ్మాయి దీప్తి సునైనా బ్రేకప్ చెప్పేసింది. అప్పటి నుండి మనోడు సోషల్ మీడియా లో కొన్ని రోజులు యాక్టీవ్ గా లేడు. కానీ ఇప్పుడు మాత్రం ఫుల్ గా యాక్టీవ్ అయ్యాడు, రీసెంట్ గా ఆయన తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో వీల్ చైర్ లో కూర్చున్న ఫోటోని అప్లోడ్ చేసాడు. ఎప్పుడైతే ఆయన ఆ ఫోటో అప్లోడ్ చేసాడో, అప్పటి నుండి ఫ్యాన్స్ తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసారు.

    నిమిషాల వ్యవధి లోనే వేలకొద్దీ కామెంట్స్ వచ్చాయి.ఫ్యాన్స్ రియాక్షన్ ని చూసిన షణ్ముఖ్ ఇది నాకోసం కాదని, మా తాతయ్య కోసం తెచ్చిందని, నేను ఊరికే సరదాగా ఫోటో దిగి సోషల్ మీడియా లో పెట్టానని చెప్పడం తో అందరూ శాంతించారు. ప్రస్తుతం షణ్ముఖ్ జస్వంత్ స్టూడెంట్ అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ యూట్యూబ్ లో అప్లోడ్ కానుంది.