https://oktelugu.com/

Kevvu Karthik : ఘనంగా జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ వివాహం!

కెరీర్ బిగినింగ్ లో అనేక కష్టాలు పడ్డ కెవ్వు కార్తీక్ జబర్దస్త్ కి వచ్చాక నిలదొక్కుకున్నాడు. తన కుటుంబానికి అండగా నిలిచాడు. కెవ్వు కార్తీక్ పలు మార్లు తన ఎమోషనల్ జర్నీ వివరించాడు. 

Written By:
  • Shiva
  • , Updated On : June 9, 2023 / 06:20 PM IST
    Follow us on

    Kevvu Karthik : జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఒక ఇంటివాడయ్యాడు. ఆయన మూడు ముళ్ల బంధంలో అడుగుపెట్టాడు. శ్రీలేఖ అనే అమ్మాయిని కెవ్వు కార్తీక్ వివాహం చేసుకున్నారు. కెవ్వు కార్తీక్ వివాహానికి మిత్రుడు గెటప్ శ్రీను సతీసమేతంగా హాజరయ్యాడు. నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశాడు. తన మిత్రుడు వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని కోరుకున్నాడు. కెవ్వు కార్తీక్ తో దిగిన ఫోటోలు ఆయన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. 

     
    ఇటీవల కెవ్వు కార్తీక్ తన పెళ్లి విషయం తెలియజేశారు. కాబోయే భార్యను సోషల్ మీడియా వేదికగా పరిచయం చేశాడు. పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటే ఏమిటో ఇప్పుడు అర్థమైంది. నా జీవిత భాగస్వామి దొరికింది. సిరి నా జీవితంలోకి వచ్చినందుకు ధన్యవాదాలు అంటూ కెవ్వు కార్తీక్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ చేశారు. అమ్మాయిని పరిచయం చేసిందే తడవుగా పెళ్లి పీటలు ఎక్కారు. కెవ్వు కార్తీక్, శ్రీలేఖ దంపతులకు అభిమానులు, జబర్దస్త్ ఆడియన్స్ బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. 
     
    కెవ్వు కార్తీక్ చాలా కాలంగా జబర్దస్త్ లో ఉన్నాడు. వరంగల్ కి చెందిన కెవ్వు కార్తీక్ మిమిక్రీ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టినట్లు సమాచారం. సినిమాపై మక్కువతో హైదరాబాద్ వచ్చి ప్రయత్నాలు చేశారు. ఆ క్రమంలో జబర్దస్త్ కమెడియన్ గా మారాడు. కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి టీమ్ లీడర్ అయ్యాడు. ముక్కు అవినాష్ తో పాటు కెవ్వు కార్తీక్ టీమ్ ని నడిపారు. అవినాష్ రెండేళ్ల క్రితం జబర్దస్త్ కి దూరమయ్యాడు. అప్పటి నుండి సోలోగా టీమ్ ని లీడ్ చేస్తున్నాడు. 
     
    అలాగే నటుడిగా అవకాశాలు అందిపుచ్చుకుంటున్నాడు. ఇటీవల విడుదలైన ముఖచిత్రం, నేను స్టూడెంట్ సర్ చిత్రాల్లో కెవ్వు కార్తీక్ నటించాడు. అలాగే మరికొన్ని చిత్రాల్లో తళుక్కున మెరిశాడు. కెరీర్ బిగినింగ్ లో అనేక కష్టాలు పడ్డ కెవ్వు కార్తీక్ జబర్దస్త్ కి వచ్చాక నిలదొక్కుకున్నాడు. తన కుటుంబానికి అండగా నిలిచాడు. కెవ్వు కార్తీక్ పలు మార్లు తన ఎమోషనల్ జర్నీ వివరించాడు.