Homeఎంటర్టైన్మెంట్Shanmukh-Deepthi Sunaina: మళ్లీ కలిసిన షణ్ముఖ్, దీప్తి సునైనా.. ఎలా కలిశారు? ఏం జరిగింది?

Shanmukh-Deepthi Sunaina: మళ్లీ కలిసిన షణ్ముఖ్, దీప్తి సునైనా.. ఎలా కలిశారు? ఏం జరిగింది?

Shanmukh-Deepthi Sunaina: సోషల్ మీడియా పుణ్యమాని చాలా మంది వ్యక్తులు వ్యక్తిగత ఇమేజ్ తెచ్చుకున్నారు. ఆ తరువాత అంచెలంచెలుగా ఎదుగుతూ కొందరు సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించగా.. మరికొందరు ఇతర మార్గాలను ఎంచుకున్నారు. ఇలా వెబ్ సిరీస్ ద్వారా ఎంట్రీ ఇచ్చి స్టార్ నటుడిగా మారాడు షణ్ముక్ జస్వంత్. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో పాపులర్ అయిన దీప్తి సునైనాతో షణ్ముక్ ప్రేమలో పడ్డాడు. ఆమె కూడా షణ్ముక్ ప్రేమను అంగీకరించడంతో వీరిద్దరూ చిలకా గోరింకలలాగా సోషల్ మీడియాలో సందడి చేశారు. మరికొద్ది రోజుల్లో పెళ్లి చేసుకునేందుకు రెడీ కాగా బిగ్ బాస్ సీజన్ వీరిని విడదీసింది. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన షణ్ముక్ అందులో సిరితో సాగించిన వ్యవహారంతో వీరి ప్రేమకు చెడింది. దీప్తి సునైనాతో విడిపోయేలా చేసింది. ఆ తరువాత ఒకరికొకరు బ్రేకప్ చెప్పుకొని ఎవరిదారి వారు చూసుకున్నారు. తాజాగా వీరిద్దరూ కలిసి సోషల్ మీడియాలో మరోసారి మెరిశారు. అంతేకాకుండా ఓ వ్యక్తి కోసం మళ్లీ కలిశారు.. కలిసి రిక్వెస్టు పెడుతున్నారు. అసలు స్టోరీ ఏంటంటే..?

Shanmukh-Deepthi Sunaina
Shanmukh-Deepthi Sunaina

సోషల్ మీడియాలో షణ్ముక్,దీప్తి సునైనా జంటకు విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. చాలాకాలం పాటు ప్రేమాయణం సాగించిన తరువాత వీరు ఒకరికోసం ఒకరు జీవించాలనుకున్నారు. వీరిద్దరు వేర్వేరు కంటే జోడీగానే ఫేమస్ అయ్యారు. కష్ట సమయాల్లో ఒకరినొకరు అండగా నిలిచారు. షణ్ముక్ తన కోసం ఏదైనా చేస్తాడని, అతనితో జీవితాంతం కలిసి ఉంటానని దీప్తి సునైనా పలు సార్లు సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది. అటు దీప్తి సునైనా అంటే తనకు ఎంతో ఇష్టమని షన్ను రకరకాల పోస్టులు పెట్టేవారు. దీంతో వీరి ఫ్యాన్స్ తొందరగా పెళ్లి చేసుకోవాలని కోరారు. అయితే ఇంతలో వారిని బిగ్ బాస్ సీజన్ 5 విడదీసింది.

Also Read: Steel Prices: ఇల్లు కట్టుకునే వారికి ఇది గుడ్ న్యూస్

అప్పటికే యూట్యూబ్ స్టార్ గా మారిపోయిన షణ్ముక్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇక్కడికి వచ్చిన తరువాత ఈ యంగ్ స్టార్ హౌస్ లోని సిరి హన్మంత్ తో కలిసిపోయాడు. ఆమెతో చనువుగా ఉండడంతో పాటు కాస్త హద్దులు దాటి ముద్దుల వరకు వెళ్లాడు. అప్పటికే దీప్తి సునైనాతో లవ్ లో ఉన్న షణ్ణు ఆ విషయాన్ని మరిచిపోయాడా..? అని చాలా మంది గుర్తు చేసినా పట్టించుకోలేదు. దీంతో దీప్తి సునైనాకు కోపం కట్టలు తెగినట్టుంది. అతనితో దూరంగా ఉండడమే బెటర్ అని భావించి బ్రేకప్ చెప్పింది. అటు షణ్ణు కూడా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చి సునైనాతో బ్రేకప్ చెప్పాడు. దీంతో ఎవరి దారిలో వారు వెళ్లారు.

Shanmukh-Deepthi Sunaina
Shanmukh-Deepthi Sunaina

తాజాగా వీళ్లిద్దరు కలిసి సోషల్ మీడియాలో మరోసారి మెరిశారు. అయితే వీళ్లిద్దరు కలిసింది. వాళ్ల కోసం కాదట. బిగ్ బాస్ ఓటీటీ కోసమట. బిగ్ బాస్ నాన్ స్టాప్ ఫైనల్ స్టేజికి వచ్చింది. బిందుమాధవి, అఖిల్ సార్థక్ లు టైటిల్ కోసం పోరాడుతున్నారు. ఈ క్రమంలో షణ్ణు, సునైనాలు కలిసి అఖిల్ కు సపోర్టు చేస్తున్నారు. ఆయనను గెలిపించాలని కోరుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ పోస్టుతో మళ్లీ వీరు కలిశారా.. ? అని ఫ్యాన్స్ షాకయ్యారు. అయితే వీరి కలయిక తాత్కాలికమే అని తెలిసి.. శాశ్వతంగా కలిసి పోవాలని కోరుతూ పోస్టులు పెడుతున్నారు. మరి షణ్ణు, సునైనాలు మరోసారి బ్రేకప్ గురించి ఆలోచిస్తారా..? లేదా ఇలా కలిసినట్టు కలుస్తారా..? అన్నది వేచిచూడాలి.

Also Read:Rupee Value: డాలర్ తో రూపాయి విలువ పడిపోతే లాభమా? నష్టమా? తెలుగు వారికి ఏం ప్రయోజనం?
Recommended Videos

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

AI Impact On Education

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...
Rahul Gandhi Injury

Rahul Gandhi Injury: రాహుల్ రక్తం కళ్ళ చూశారు.. మోడీకి ఇది మైనస్సే

Rahul Gandhi Injury: మల్లికార్జున కార్గే నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లారు.. పోలీసులు కూడా వారి కేవలం శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే వెళ్తున్నారని...
Ishan Kishan

Ishan Kishan: ఐపీఎల్ లో పరుగుల వరద పారించాడు.. జాతీయ జట్టులో తేలిపోతున్నాడు.. ఇలా అయితే కష్టమే..

Ishan Kishan: అప్పట్లో దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు. వన్డేలో అతడికి డబుల్ సెంచరీ కూడా ఉంది. ఈ స్థాయిలో ఆడిన అతడు స్థిరత్వాన్ని కొనసాగించలేకపోయాడు. దీనికి తోడు క్రమశిక్షణలోపించడంతో జట్టులో స్థానం...
Vijayendra Prasad

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...
Mahesh Babu

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...
Oktelugu Epaper