https://oktelugu.com/

Indian 3: నేరుగా ఓటీటీలోకి రాబోతున్న శంకర్ ‘ఇండియన్ 3’..విడుదల తేదీ కూడా ఫిక్స్!

శంకర్ సినిమాకి ఇంటర్వెల్ కూడా పడకముందే థియేటర్స్ నుండి లేచి పారిపోయే పరిస్థితి వస్తుందని మనం ఎప్పుడైనా ఊహించామా?, అది కూడా ఇండియన్ లాంటి ఆల్ టైం క్లాసిక్ సీక్వెల్ కి?, ఊహించలేదు కదూ!..కానీ శంకర్ ఆ ముచ్చట కూడా ఈ సినిమా ద్వారా తీర్చేసాడు. అసలు శంకర్ స్థాయి ఏంటి?, ఎలాంటి గొప్ప సినిమాలు తీసేవాడు?, ఇలా తయారయ్యాడే!.. అని ఆయన అభిమానులు విలపించారు.

Written By:
  • Vicky
  • , Updated On : October 3, 2024 1:43 pm
    Indian 3

    Indian 3

    Follow us on

    Indian 3: సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ చిరకాలం గుర్తించుకునే సినిమాలలో ఒకటి ‘భారతీయుడు’. తమిళం ‘ఇండియన్’ పేరిట విడుదలై సంచలన విజయం సాధించిన ఈ చిత్రాన్ని, తెలుగు లో భారతీయుడిగా దబ్ చేసి విడుదల చేసారు. అప్పట్లో ఈ చిత్రం సృష్టించిన సునామి మామూలుది కాదు. కేవలం తెలుగు, తమిళ్ లో మాత్రమే కాకుండా హిందీ లో కూడా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించింది. ఇప్పటికీ కూడా ఈ సినిమాని చూస్తే మన రోమాలు నిక్కపొడుచుకుంటాయి. సేనాపతి గా కమల్ హాసన్ నటవిశ్వరూపానికి, ఆ క్యారక్టర్ ని రూపొందించిన డైరెక్టర్ శంకర్ కి చేతులెత్తి మొక్కినా తక్కువే. అంత అద్భుతంగా ఉంటుంది. అలాంటి సినిమాకి సీక్వెల్ అంటే ఏ రేంజ్ లో ఉండాలి?, ఊహించిన రేంజ్ లో కాకపోయినా కనీసం యావరేజ్ రేంజ్ లో అయినా ఉండాలి కదా?, కానీ డైరెక్టర్ శంకర్ ఎంత చెత్తగా తీసాడో మనమంతా చూసాము.

    ఒక శంకర్ సినిమాకి ఇంటర్వెల్ కూడా పడకముందే థియేటర్స్ నుండి లేచి పారిపోయే పరిస్థితి వస్తుందని మనం ఎప్పుడైనా ఊహించామా?, అది కూడా ఇండియన్ లాంటి ఆల్ టైం క్లాసిక్ సీక్వెల్ కి?, ఊహించలేదు కదూ!..కానీ శంకర్ ఆ ముచ్చట కూడా ఈ సినిమా ద్వారా తీర్చేసాడు. అసలు శంకర్ స్థాయి ఏంటి?, ఎలాంటి గొప్ప సినిమాలు తీసేవాడు?, ఇలా తయారయ్యాడే!.. అని ఆయన అభిమానులు విలపించారు. అసలు ఈ సినిమాకి శంకర్ దర్శకత్వం నిజంగానే దర్శకత్వం వహించాడా? అనే సందేహాలు కూడా ఏర్పడ్డాయి. అంత చెత్తగా, నీచంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ముఖ్యంగా చరిత్ర పుట్టల్లో నిలిచిపోయిన సేనాపతి క్యారక్టర్ ని కామెడీ చేసేసాడు, ఇదే అభిమానుల్లో శంకర్ పై తీవ్రమైన అసహనం రేపిన అంశం. అయితే ‘ఇండియన్ 2 ‘ చిత్రం పూర్తి అవ్వగానే, రోలింగ్ టైటిల్స్ పడేముందు ‘ఇండియన్ 3’ ట్రైలర్ వేస్తారు.

    ఈ ట్రైలర్ కి మాత్రం అభిమానుల నుండి, ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ‘ఇండియన్ 2’ లో ఎలాంటి అంశాలు ఉంటాయని ఆశించామో, అలాంటివన్నీ ‘ఇండియన్ 3’ ఉన్నట్టుంది, నిజమైన శంకర్ మార్క్ సినిమా అంటే ఇదే అంటూ పొగిడారు అభిమానులు. ఈ సినిమా షూటింగ్ కూడా 80 శాతం కి పైగా పూర్తి అయ్యింది. కానీ ‘ఇండియన్ 2’ ఫ్లాప్ అవ్వడంతో ఈ సినిమా థియేటర్స్ లో విడుదల అవ్వడం అసాధ్యం అని అనుకున్నారు ఆడియన్స్. కానీ ఈ చిత్రాన్ని థియేటర్స్ లో విడుదల చేయలేకపోయినా, ఓటీటీ లో నేరుగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 14 వ తేదీన ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళం భాషల్లో విడుదల కానుంది. కనీసం ఈ సినిమా అయినా అభిమానులను మెప్పిస్తుందో లేదో చూడాలి.