Konda Surekha: ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇక ఆ పార్టీలో మంత్రిగా పదవి బాధ్యతలను కొనసాగిస్తున్న కొండ సురేఖ రీసెంట్ గా కేటీఆర్ ను ఉద్దేశిస్తూ సమంత మీద అక్కినేని ఫ్యామిలీ మీద కొన్ని ఘాటు వ్యాఖ్యలైతే చేశారు. ఇంకా దాని మీద ఇండస్ట్రీలోని పెద్దలు పలు రకాల కామెంట్లను చేశారు. ముఖ్యంగా ఆమె మాట్లాడిన మాట తీరు సరిగ్గా లేదని సెలబ్రిటీల మీద ఇలాంటి కామెంట్లు చేయడం సరైన విషయం కాదంటూ పలువురు హీరోలు బగ్గుమనడంతో ఆమె దిగివచ్చి సమంతకి అక్కినేని ఫ్యామిలీకి సారీ చెప్పింది. ఇక ఈ విషయంలో ఎవరెవరు ఎలా స్పందించారు అనేది ఒకసారి మనం చూద్దాం…
చిరంజీవి
చిరంజీవి లాంటి స్టార్ హీరో ఈ విషయం పైన స్పందిస్తూ ఇలా సినిమా ఇండస్ట్రీలోని సెలబ్రెటీలను టార్గెట్ చేస్తూ రాజకీయ నాయకులు కామెంట్స్ చేయడం సరైన విషయం కాదు. మరోసారి ఇలాంటి కామెంట్లు చేస్తే ఊరుకునేది లేదనే రేంజ్ లో చిరంజీవి తన నిర్ణయాన్ని తెలియజేశాడు…
జూనియర్ ఎన్టీయార్
ఒక జూనియర్ ఎన్టీఆర్ సైతం ఈ విషయం మీద స్పందిస్తూ ఒక ఆడ మనిషి మీద మరొక ఆడ మనిషి ఇలాంటి మాటలు మాట్లాడటం అనేది సరైన విషయం కాదు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వారికి కూడా పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది. ఏదైనా ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది అని అన్నాడు…
నాని
ఇక నాని కూడా ఈ విషయం మీద స్పందిస్తూ కొండా సురేఖ మాట్లాడిన మాటలు చాలా నాన్సెన్స్ క్రియేట్ చేశాయని అన్నాడు. ఆమె అలా మాట్లాడడం కరెక్ట్ కాదని ఆయన ఆవిడ మాట్లాడిన మాటలను ఖండించారు…
ఆర్జీవీ
ఇక సమంత అక్కినేని ఫ్యామిలీ మీద కొండా సురేఖ చేసిన కామెంట్లను ఖండిస్తూ ఆర్జీవి తన స్టైల్ లో కొండ సురేఖ మాటలను ఖండించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు ఆలోచించాలి అనేలా ఆయన పోస్ట్ చేశారు…
ఇంక వీళ్ళతోపాటు కుష్బూ లాంటి నటులు కూడా స్పందించడం ఇక మొత్తానికైతే సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్ల మీద వరుసగా ఇలాంటి రూమర్స్ ను క్రియేట్ చేసి రాజకీయ నాయకులు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు అంటూ ప్రతి ఒక్కరు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…