Bharateeyudu: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో భారతీయుడు సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తెలుగులో భారతీయుడుగా, హిందీలో హిందుస్థాని గా డబ్ అయి మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా ప్రేక్షకులందరిలో కమలహాసన్ ను స్టార్ హీరోని చేసింది. నిజానికి శంకర్ ఈ సినిమాను రజనీకాంత్ తో చేయాలని అనుకొని ఈ కథను రెడీ చేసుకున్నాడట.
కానీ అప్పటికి రజనీకాంత్ అవలెబుల్ లో లేకపోవడం వల్ల ఈ కథని కమలహాసన్ కి వినిపించాడు. కమలహాసన్ కి ఈ కథ బాగా నచ్చింది. దాంతో ఆయన ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ముఖ్యంగా తండ్రి కొడుకులు ఇద్దరి పాత్రలను తనే చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇక ఇదిలా ఉంటే శంకర్ మాత్రం కమల్ హాసన్ ఈ సినిమా చేయకపోతే తెలుగులో స్టార్ హీరోలైన రాజశేఖర్ వెంకటేష్ లతో ఈ సినిమా చేయాలని అనుకున్నారట. కానీ లక్కీగా ఈ కథ విన్న కమలహాసన్ ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. కాబట్టి ఇక వారిని సంప్రదించాల్సిన అవసరం అయితే శంకర్ కి రాలేదు. ఒకవేళ కమలహాసన్ ఒప్పుకోకపోతే రాజశేఖర్ తో సేనాపతి క్యారెక్టర్ వెంకటేష్ తో చందు క్యారెక్టర్ చేయించి ఈ సినిమాని కంప్లీట్ చేయాలని తను అనుకున్నారట.
కానీ కమల్ హాసన్ రెండు పాత్రలు చేసి ఈ సినిమాను సక్సెస్ చేయడంతో కమల్ హాసన్ కి శంకర్ కి మంచి గుర్తింపు అయితే వచ్చింది. ఇక ఇదిలా ఉంటే ఈ న్యూస్ తెలుసుకున్న చాలామంది అభిమానులు సేనాపతి క్యారెక్టర్ లో రాజశేఖర్ గాని, వెంకటేష్ గాని ఎవరు నటించిన మెప్పించేవారు కాదు. అది కమలహాసన్ మాత్రమే చేయగలిగే పాత్ర ఆయనలా నటించే నటుడు మరొకరు లేరు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
నిజానికి ఆ పాత్రలో వేరే ఏ హీరో కూడా అంత బాగా నటించి మెప్పించలేడు అనేది మాత్రం వాస్తవం. అందుకే కమలహాసన్ మాత్రమే దానికి పరిపూర్ణంగా న్యాయం చేశారు అనేది సినిమా చూసిన ప్రతి ఒక్కరు చెప్పే మాట. ఇక ప్రస్తుతం ఈనెల 12వ తేదీన భారతీయుడు 2 సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు…