Shankar , Murugadoss
Shankar and Murugadoss : చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నారు. ఇక దర్శకులు సైతం ఒక్క సక్సెస్ తో పాన్ ఇండియాని ఎలేద్దాం అనే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకప్పటి సీనియర్ దర్శకులు ఇప్పుడు ఒక్క సక్సెస్ ని సాధించడానికి విపరీతంగా కష్టపడుతున్నారనే విషయాలు కొంత మంది దర్శకులను చూస్తే మనకు ఈజీగా అర్థమవుతుంది…ఇక ఇలాంటి క్రమంలోనే శంకర్, మురుగదాస్ లాంటి దర్శకులు వరుసగా డిజాస్టర్లను మూటగట్టుకుంటున్నారు… వీళ్ళు ఒకప్పుడు వరుస సక్సెస్ లను అందుకున్నారు. మరి ఇప్పుడు ఫెయిల్ అవ్వడానికి గల కారణాలు ఏంటి అనే ధోరణిలోనే కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి…
తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లందరూ ఒకప్పుడు ఫ్లాప్ అనేది లేకుండా వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్లారు. కానీ రోజులు మారాయి ఇప్పుడు వాళ్లు ఒక సినిమాతో సక్సెస్ ని సాధించడానికి చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా శంకర్, మురుగదాస్ లాంటి దర్శకులు మాత్రం ఇప్పుడు సక్సెస్ ని సాధించడం చాలా కష్టతరం అయిందనే చెప్పాలి. ఒకప్పుడు వీళ్ళ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులందరు ఆసక్తితో ఎదురు చూస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు సిచువేషన్స్ మొత్తం మారిపోయాయి. సినిమా ఇండస్ట్రీలో వాళ్లకంటూ ఒక స్టార్ డమ్ ను ఏర్పాటు చేసుకోవడానికి వాళ్ళు అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తునారు. కానీ ప్రస్తుతం వాళ్లకు ఒక్క సక్సెస్ కూడా రావడం లేదు ఇక రీసెంట్ గా శంకర్ ‘గేమ్ చేంజర్’ సినిమాతో భారీ ఫ్లాప్ ని మూటగట్టుకుంటే మురుగదాస్ సల్మాన్ ఖాన్ తో చేసిన సికిందర్ సినిమాను రీసెంట్గా రిలీజ్ చేశాడు.
Also Read : 5 సెకండ్ల సీన్ కి 5 కోట్లు ఏంటి సామి…శంకర్ పిచ్చి పరాకాష్టకు చేరిందా..?
ఇక ఈ సినిమా కూడా ఆశించిన మేరకు ఫలితాన్ని అయితే ఇవ్వలేక పోయింది. తద్వారా ఈ సీనియర్ దర్శకులు ఇద్దరు కూడా సక్సెస్ లను ఇవ్వలేరు అంటూ చాలామంది హీరోలు వాళ్లకు డేట్స్ ని కూడా ఇవ్వడం లేదనే వార్తలైతే ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
గత కొన్ని సంవత్సరం నుంచి వీళ్ళ సినిమాలు సక్సెస్ ల బాట పట్టకపోవడంతో స్టార్ హీరోలు సైతం వీళ్ళతో సినిమాలు చేయకుండా మొహం చాటేస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. మురుగదాస్ ఒకప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి కమర్షియల్ సినిమాలను చేస్తూ అందులో ఒక మెసేజ్ ని సైతం ఇస్తూ విపరీతమైన ఆదరణను అందుకున్నాడు. అలాంటి దర్శకుడు ఇప్పుడు సక్సెస్ ల కోసం పరితపిస్తూ ఉండడం నిజంగా చాలా బాధాకరమైన విషయమనే చెప్పాలి.
ఇక శంకర్ లాంటి దర్శకుడు అయితే వరుసగా సక్సెస్ లను సాధిస్తూ ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలందరూ అతనితో ఒక్క సినిమా అయినా చేయాలి అనుకునే రేంజ్ లో గొప్ప విజయాలను సాధించాడు. కానీ గత పది సంవత్సరాల నుంచి ఇప్పటివరకు ఆయనకు ఒక్క సరైన సక్సెస్ కూడా లేకపోవడంతో ఆయన కూడా ఫెడౌట్ దశకు చాలా దగ్గరగా ఉన్నాడు అంటూ కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…అయితే వీళ్లిద్దరూ కూడా ఈ జనరేషన్ కి తగ్గట్టుగా అప్డేట్ అవ్వకపోవడం వల్లే వాళ్ళకి ప్లాప్ లు వస్తున్నాయి అంటూ మరి కొంతమంది సినిమా క్రిటిక్స్ సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…
Also Read : శంకర్ దెబ్బకు సినీ ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోయిన ‘లైకా ప్రొడక్షన్స్!