Anant Ambani Pre Wedding: జామ్ నగర్ లో అనంత్ అంబానీ వెడ్డింగ్ అంగరంగ వైభవంగా జరిగింది. దాదాపు మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలో చాలా మంది స్టార్ సెలబ్రెటీలు హాజరయ్యారు. బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రెటీలు మాత్రమే కాదు ప్రముఖ వ్యాపారవేత్తలు, కోలీవుడ్ స్టార్స్ కూడా హాజరయ్యారు. ఇక ఈ పెళ్లి వేడుకలో టాలీవుడ్ నుంచి రామ్ చరణ్, ఉపాసనలకు మాత్రమే ఆహ్వానం అందిందట. అయితే ఈ దంపతులు అక్కడికి హాజరయ్యారు.
ఈ ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో భాగంగా ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కూడా హాజరయ్యారు. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ రామ్ చరణ్ ను అవమానించారు అనే వార్త వైరల్ గా మారింది. ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నటువంటి ఈయనకు జరిగిన అవమానం తెలిసి మెగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో భాగంగా షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ ముగ్గురు కలిసి వేదికపై నాటు నాటు పాటకు స్టెప్పులు వేశారు.
అయితే రామ్ చరణ్ ను కూడా పిలిచి ఆయనతో కూడా స్టెప్పులు వేయించారు. రామ్ చరణ్ ను స్టేజ్ పైకి పిలిచే క్రమంలోనే అవమానం జరిగిందట. ఇడ్లీ-వడ అని సంబోధిస్తూ షారుఖ్ ఖాన్ రామ్ చరణ్ ను స్టేజ్ పైకి పిలిచారట. ఈ విషయాన్ని ఉపాసన మేకప్ ఆర్టిస్టు జెబా హాసన్ పేర్కొంది. ఆమె ఇన్ స్టా స్టోరీలో ఈ విషయాన్ని తెలియజేయగానే అందరూ షాక్ అవుతున్నారు.
టాలీవుడ్ హీరోలను ఇడ్లీ-వడ అన్నట్టుగా.. బాలీవుడ్ హీరోలను వడాపావ్ అంటే ఊరుకుంటారా? అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. అయినా షారుఖ్ ఫన్నీగా పిలిచినా కూడా షారుఖ్ అలా పిలవడం జీర్ణించుకోలేకపోతున్నారు చరణ్ అభిమానులు. మరి దీని మీద ఆ స్టార్ సెలబ్రెటీలు ఎలా స్పందిస్తారో చూడాలి.