Shambhala Movie 2 Days Collections: 2025 వ సంవత్సరం చిన్న సినిమాలకు గోల్డెన్ ఇయర్ అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ఎన్నో ఆశల మధ్య విడుదలైన భారీ చిత్రాలు మిశ్రమ ఫలితాలను అందుకుంటే, ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన చిన్న సినిమాలు మాత్రం బయ్యర్స్ కి ఈ ఏడాది భారీ లాభాలను తెచ్చి పెట్టాయి. ఏడాది ప్రారంభం లో ఇలాగే ఉన్నింది, ఏడాది చివర్లో కూడా అలాగే ఉంది. క్రిస్మస్ కానుకగా నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. ఈ నాలుగు సినిమాల్లో ఆది శివకుమార్ హీరో గా నటించిన ‘శంబాలా'(Sambhala Movie) మూవీ కమర్షియల్ గా బయ్యర్స్ కి బాగా వర్కౌట్ అయ్యేలా ఉంది. విడుదలకు ముందే టీజర్, ట్రైలర్ లతో ఈ చిత్రం ఆడియన్స్ దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించింది. ఆకాశం నుండి ఒక ఆస్ట్రోనట్ ఒక గ్రామం లో పడడం, దానిని గ్రామా ప్రజలు దైవ శక్తికి గా బావిచడం, ఇలా సైన్స్ మరియు దైవ భక్తికి మధ్య జరిగే పోరాటం లాగా ఈ ట్రైలర్ లో చూపించారు.
సినిమా చాలా ఆసక్తికరంగా ఉండేలా ఉంది అనే ఫీలింగ్ ప్రమోషనల్ కంటెంట్ తోనే పుట్టించడం లో మేకర్స్ సక్సెస్ అయ్యారు. అలా మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు, మొదటి ఆట నుండే మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. అనుకున్న దానికంటే మేకర్స్ ఈ చిత్రాన్ని బాగా తీశారు, ఇలాంటి కొత్త తరహా సినిమాల కోసమే మేము ఎదురు చూస్తున్నాం అంటూ కామెంట్స్ చేశారు. అయితే టాక్ కి తగ్గట్టుగానే కలెక్షన్స్ కూడా ఉన్నాయని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. వాళ్ళు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే ఈ చిత్రానికి మొదటి రోజు 2 కోట్ల 75 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, 1 కోటి 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు. ఇక రెండవ రోజు అయితే ఈ చిత్రానికి వర్కింగ్ డే అయినప్పటికీ కూడా బుక్ మై షో యాప్ లో 22 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి.
ఓవరాల్ వరల్డ్ వైడ్ గా రెండవ రోజు కోటీ 90 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను ఈ చిత్రం సొంతం చేసుకోగా, షేర్ వసూళ్లు 95 లక్షల రూపాయిల వరకు వచ్చాయని అంటున్నారు. ఓవరాల్ గా రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 4 కోట్ల 65 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 2 కోట్ల 35 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా విడుదలకు ముందు ఈ సినిమాకు జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కేవలం 5 కోట్లు మాత్రమే. అంటే ఇక కేవలం 2 కోట్ల 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను ఈ చిత్రం రాబడితే బ్రేక్ ఈవెన్ అయ్యినట్టే. ఈ రెండు రోజుల్లో బ్రేక్ ఈవెన్ మార్కుని ఈ చిత్రం అందుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. సోమవారం నుండి ఇక బయ్యర్స్ లాభాలు లెక్కపెట్టుకోవడమే, మొత్తానికి ఆది శివకుమార్ చాలా కాలం తర్వాత ఒక సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.