Shakila : సినీ నటుల జీవితాలు మనం ఇప్పుడు చూస్తున్నట్టుగా ఎంతో సుఖంగా, విలాసవంతంగా ఏమి ఉండదు. వాళ్ళు పడే శ్రమ, కష్టంలో మనం పావు శాతం కూడా పడలేము అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. గంటల తరబడి ప్రాక్టీస్ చేస్తూ, నెలల తరబడి షూటింగ్స్ చేస్తేనే వాళ్లకు ఆ జీవితం దక్కుతుంది. సినీ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టడం కూడా అంత సులువైన విషయం కాదు. ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదురుకొని ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి నేడు స్టార్స్ గా, సూపర్ స్టార్స్ గా ఎదిగిన హీరోలు, హీరోయిన్లు ఉన్నారు. నిజానికి కొంతమంది సినీ సెలెబ్రిటీలు ఎదురుకున్న కష్టాలను చూస్తే కన్నీళ్లు రాక తప్పదు. అలాంటి జీవితాలు మనకి వస్తే పగవాడికి కూడా ఇలాంటి కష్టాలు రాకూడదు అని కోరుకుంటాము. అలాంటి కష్టాలెన్నో అనుభవించి నేడు స్టార్ గా ఎదిగిన ఒక హీరోయిన్ గురించి నేడు మనం మాట్లాడుకోబోతున్నాము. ఆమె మరెవరో కాదు షకీలా.
ఈమెకి మలయాళం ఇండస్ట్రీ లో ఎలాంటి క్రేజ్ ఉండేదో మనం కథలు కథలుగా చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాం. ఈమె సినిమాలు విడుదలైతే అప్పట్లో మమ్మూటీ, మోహన్ లాల్ వంటి సూపర్ స్టార్ సినిమాలు వెలవెలబోయేవి. ఆ స్థాయిలో కేరళ ఆడియన్స్ ఈమెకి బ్రహ్మరథం పట్టేవారు. షకీలా ఇదే ఇండస్ట్రీ లో ఉంటే మన సినిమాలను ఇక ఎవ్వరూ చూడరని, అస్లీల చిత్రాలు చేసి జనాలను చెడగొడుతుంది అనే నెపంతో ఆమెని మలయాళం సినీ ఇండస్ట్రీ బహిష్కరించింది. ఇక ఆ తర్వాత మలయాళం నుండి టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన షకీలకి ఇక్కడ హీరోయిన్ రోల్స్ మాత్రం ఎవ్వరూ ఇవ్వలేదు. కేవలం క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ మాత్రమే చేసింది. ఇవన్నీ పక్కన పెడితే చిన్నతనం లో షకీల ఎదురుకున్న చేదు గణపకాలను ఇటీవలే ఆమె ఒక ఇంటర్వ్యూ లో పంచుకొని కన్నీళ్లు పెట్టింది. షకీల శరీరం చిన్నప్పటి నుండి లావుగా ఉండేదట, ఆమె స్కూల్ చదివే సమయానికి, కాలేజీ అమ్మాయి లాగా కనిపించేదట. దారిన పోయే ప్రతీ ఒక్కరు ఈమె అందాన్ని చూసి అలా నోరెళ్ళబెట్టి చూసేవారట. ఇక ఆమె కన్న తల్లి అయితే షకీల అందాన్ని వాడుకొని డబ్బులు చేసుకోవాలని చూసిందట.
అప్పట్లో వీళ్లకు పూట గడవడమే చాలా కష్టం గా ఉండే పరిస్థితి ఉండడంతో తప్పనిసరి పరిస్థితిలో ఆమె తల్లి షకీల ని వ్యభిచారం చెయ్యించడడానికి పూనుకుందట. బలవంతంగా మగవాళ్ల దగ్గరకి తీసుకెళ్లి బెడ్ రూమ్ లో పడుకోబెట్టి వచ్చేదట. నాకు ఈ పని ఇష్టం లేదు నేను చెయ్యలేను అని షకీల మొండికేస్తే ఆమెని చితకబాదేది ఆమె తల్లి. ఇక వేరే దారిలేక షకీలా ఆ రంగంలోకి అడుగుపెట్టింది. అయితే అదే వ్యభిచారం నేడు ఆమెని స్టార్ హీరోయిన్ ని కూడా చేసింది. ఇకపోతే ఈమె గత బిగ్ బాస్ సీజన్ లో ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టి రెండవ వారంలోనే ఎలిమినేట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read More