Homeఎంటర్టైన్మెంట్'ష‌కీలా' వాట్సాఫ్ గ్రూప్.. కొత్త భామలకు పాఠాలు !

‘ష‌కీలా’ వాట్సాఫ్ గ్రూప్.. కొత్త భామలకు పాఠాలు !

‘ష‌కీలా..’ ఒక జనరేషన్ కుర్రాళ్ళను తన అంగాంగ ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో అల‌రించిన బోల్డ్ నటి. ఒక ఐటమ్ భామ త‌న‌కంటూ ప్ర‌త్యేకమైన అభిమాన సంఘాలను సంపాదించుకోవడం అంటే.. అదీ స్టార్ హీరోలకు పోటీగా అంటే.. బహుశా ఒక్క షకీలా విషయంలోనే అలా జరిగిందనుకుంటా. మలయాళ సూపర్ స్టార్, మెగాస్టార్ కూడా షకీలా సినిమాకి పోటీగా సినిమాని రిలీజ్ చేసే ధైర్యం చేసేవారు కాదు అంటేనే.. షకీలా గతం ఎంత వైభవంగా గడిచిందో అర్ధం చేసుకోవచ్చు. షకీలా ఫామ్ లో […]

‘ష‌కీలా..’ ఒక జనరేషన్ కుర్రాళ్ళను తన అంగాంగ ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో అల‌రించిన బోల్డ్ నటి. ఒక ఐటమ్ భామ త‌న‌కంటూ ప్ర‌త్యేకమైన అభిమాన సంఘాలను సంపాదించుకోవడం అంటే.. అదీ స్టార్ హీరోలకు పోటీగా అంటే.. బహుశా ఒక్క షకీలా విషయంలోనే అలా జరిగిందనుకుంటా. మలయాళ సూపర్ స్టార్, మెగాస్టార్ కూడా షకీలా సినిమాకి పోటీగా సినిమాని రిలీజ్ చేసే ధైర్యం చేసేవారు కాదు అంటేనే..

షకీలా గతం ఎంత వైభవంగా గడిచిందో అర్ధం చేసుకోవచ్చు. షకీలా ఫామ్ లో ఉన్నప్పుడు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో ఎంత మంది అగ్ర‌నటీమణులు ఉన్నా, ఎంతమంది బోల్డ్ భామలు ఉన్నా.. ష‌కీలా క‌థ వేరే. షకీలా స్టార్ డమే వేరు. ఇప్ప‌టి వ‌ర‌కు షకీలా ప‌లు భాష‌ల్లో దాదాపు 200కు పైగా సినిమాల్లో న‌టించింది. కానీ ఇన్ని సినిమాలు చేసినా తనకంటూ ఏమి మిగుల్చుకోలేకపోయింది.

సంపాదించింది మొత్తం వాళ్లకు వీళ్లకు దారాదత్తం చేయడమే సరిపోయింది. దీనికి తోడు కుటుంబ సభ్యులు కూడా షకీలాను దారుణంగా మోసం చేశారు. త‌న అంద‌చందాల ఆర‌బోత‌తో వెండితెర‌కు మ‌త్తెక్కించిన ష‌కీలాకి చివరకు ఏడుపు మాత్రమే మిగిలింది. తనలా మరొకరు అవ్వకూడదు అని షకీలా వర్ధమాన నటీమణులకు అవగాహన కల్పించడానికి ఓ వాట్సాఫ్ గ్రూప్ యాడ్ చేసిందట.

ఈ గ్రూప్ లో కేవలం కొత్త బోల్డ్ భామలకు మాత్రమే చోటు ఉంది. మొత్తానికి షకీలా, తన జీవిత అనుభవాలను తనలాంటి కొత్త అమ్మాయిలకు వివరంగా వివరించి, వారిని తనలా మారకుండా చేయాలని దృఢసంకల్పం తీసుకుంది. ఆ మధ్య షకీలా ఓ ఇంటర్వ్యూలో త్వ‌ర‌లో నేను రాజ‌కీయాల్లోకి వ‌స్తాను అంటూ సగర్వంగా ప్ర‌క‌టించింది. కానీ ఆమెను మాత్రం ఏ రాజకీయ పార్టీ ఆహ్వానించలేదు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper