Homeఎంటర్టైన్మెంట్Shahrukh Khan OTT Platform: 'కింగ్ ఖాన్.. ఓటీటీ సామ్రాజ్యాన్ని ఏలబోతున్నాడు...

Shahrukh Khan OTT Platform: ‘కింగ్ ఖాన్.. ఓటీటీ సామ్రాజ్యాన్ని ఏలబోతున్నాడు !

Shahrukh Khan OTT Platform:  కరోనా పుణ్యమా అని ప్రపంచ వ్యాప్తంగా ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్ కు ఫుల్ గిరాకీ పెరిగింది. ప్రేక్షకులు ఓటీటీలకు బాగా అలవాటు పడ్డారు. గ్రామీణ యువత కూడా ఓటీటీలోనే ఎక్కువగా తమ కాలాన్ని గడిపేస్తున్నారు. ఈ క్రమంలో థియేటర్ల మనుగడకు కూడా ప్రమాదం ఏర్పడిన పరిస్థితి. మొత్తమ్మీద భవిష్యత్తు మొత్తం ఓటీటీలదే అని అర్థం అయిపోయింది. అందుకే, ఈ ఊపులో పలు కొత్త ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్ కూడా అందుబాటులోకి వచ్చేస్తున్నాయి.

Shahrukh Khan OTT Platform
Shah Rukh Khan

ఇప్పటికే పలు వ్యాపారాల్లో మునిగి తేలుతున్న బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ కూడా ఓటీటీ వ్యాపారంలోకి అడుగు పెట్టాడు. ‘అసలు ఈ ఓటీటీ ప్రపంచంలో ఏదో జరగబోతోంది’ అంటూ తన ఓటీటీ ప్లాట్‌ ఫామ్ ‘SRK+’ ను ఈ స్టార్ హీరో గ్రాండ్ గా ఇంట్రడ్యూజ్ చేశాడు. షారుఖ్ ఓటీటీ ఎనౌన్స్ మెంట్ చూసి బాలీవుడ్ కూడా థ్రిల్ ఫీల్ అయ్యింది.

Also Read: ‘పుష్ప 3’లో హీరో విజయ్ దేవరకొండ.. మరి బన్నీ ఏమిటి ?

షారుఖ్ అప్ డేట్ పై సల్మాన్ ఖాన్ కూడా స్పందిస్తూ.. ‘షారుఖ్ కొత్త ఓటీటీ యాప్ లాంచ్ చేసినందుకు బెస్ట్ కంగ్రాట్స్. ఈ రోజు రాత్రి నువ్వు మాకు పార్టీ ఇవ్వాలి’ అని సల్మాన్ తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపాడు. అలాగే, స్టార్ దర్శకనిర్మాత కరణ్ జోహార్, మరో టాలెంటెడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్‌ తో సహా పలువురు సెలబ్రిటీలు ‘బాద్‌ షా షారుఖ్’ ఓటీటీ గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుకుంటూ తమ విషెస్ తెలిపారు.

మరో పక్క షారుఖ్ అభిమానులు కూడా ఈ వార్త పై తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ.. ‘కింగ్ ఖాన్.. ఇక పై ఓటీటీ సామ్రాజ్యాన్ని కూడా అట్టహాసంగా పరిపాలించబోతున్నాడు’ అంటూ మెసేజ్ లు చేస్తూ మురిసిపోతున్నారు. మరి అందరూ కోరుకుంటున్నట్లు షారుఖ్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.

Shahrukh Khan OTT Platform
Shahrukh Khan OTT Platform

ప్రస్తుతానికి ప్రాంతీయభాషల్లోనూ పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్అందుబాటులోకి వస్తున్నాయి. మరి ఇప్పుడు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ లాంటి స్టార్ హీరోలు కూడా ఓటీటీలోకి అడుగుపెడితే పోటీ మరింత రసవత్తరంగా మారుతుంది. కొత్త కంటెంట్ కి బెస్ట్ ప్లాట్ ఫామ్స్ దొరుకుతాయి.

ఎలాగూ స్టార్ హీరోలకు మిలియన్ల మంది అభిమానులు ఉంటారు కాబట్టి.. వాళ్ళంతా తమ హీరో ఓటీటీ ప్లాట్ ఫామ్ కు ఫుల్ సపోర్ట్ చేస్తారు. షారుఖ్ ఐపిఎల్ లో ‘కలకత్తా నైట్ రైడర్స్’ వంటి టీమ్ తో విజయవంతమైన బిజినెస్ మేన్ అని నిరూపించుకున్న సంగతి తెలిసిందే.

Also Read: NTR Comments On RRR Movie: అలా ఐతే ‘ఆర్ఆర్ఆర్’ ఒప్పుకునే వాడిని కాదు – ఎన్టీఆర్

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

2 COMMENTS

  1. […] Prabhas with Krithi Shetty:  కృతిశెట్టి గట్టిగా నాలుగు సినిమాలు కూడా చేయలేదు. అప్పుడే అమ్మడు స్టార్‌ హీరోయిన్స్‌ జాబితాలో చేరిపోయింది. నిజానికి ‘ఉప్పెన’ సినిమా రిలీజ్ కి ముందే కృతిశెట్టి కోసం హీరోలు పోటీ పడ్డారు. మొత్తానికి కృతిశెట్టి వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. పైగా కృతిశెట్టిలో ప్రతిభ, లౌక్యం ఉన్నాయి. అందుకే ‘కృతి శెట్టి’ తెలుగు తెరపై చాలా త్వరగా తనదైన ముద్ర వేసింది. ఆకర్షించే అందం, ఆకట్టుకునే నటన ఆమెను తెలుగు ప్రేక్షకుల హృదయాలకు మరింత దగ్గర చేసింది. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular