Homeఎంటర్టైన్మెంట్Dacoit Movie Review : అట్టట్ట అనిపించే డెకాయిట్

Dacoit Movie Review : అట్టట్ట అనిపించే డెకాయిట్

Dacoit Movie Review రివ్యూ: డెకాయిట్
నటీనటులు: అడివి శేష్, మృణాల్ ఠాకూర్, అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి, సునీల్ తదితరులు.
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఛాయాగ్రహణం: ధనుష్ భాస్కర్
దర్శకత్వం: షానీల్ దేవ్
నిర్మాతలు: సుప్రియ యార్లగడ్డ

వైవిధ్యమైన థ్రిల్లర్ సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న అడివి శేష్, ఈసారి డెకాయిట్ అనే లవ్, యాక్షన్ మేళవించిన ఒక థ్రిల్లర్ తో మన ముందుకు వచ్చాడు. గతంలో క్షణం, గూఢచారి, మేజర్ వంటి హిట్లతో మంచి ఊపుమీదున్న శేష్, రూట్ మార్చి చేసిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించగలిగింది? గత చిత్రాల తరహాలోనే ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిందా లేదా అనేది రివ్యూలో చూద్దాం.

K. హరి దాస్ (అడివి శేష్), సరస్వతి అలియాస్ జూలియట్ (మృణాల్ ఠాకూర్) ఒకరినొకరు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకుంటారు. వారిద్దరూ పెళ్లి చేసుకుని కలకాలం హాయిగా జీవించాలని అనుకున్న సమయంలో ఒక నేరం జరగడం, తదనంతర పరిణామాల్లో సరస్వతి ఇచ్చిన సాక్ష్యం వల్ల హరి 13 ఏళ్ల పాటు హరి జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. తన జీవితాన్ని నాశనం చేసిన ప్రియురాలిపై పగ తీర్చుకోవడమే లక్ష్యంగా హరి జైలు నుంచి తప్పించుకుని బైటకి వస్తాడు. అప్పటికే జూలియట్ మరొకరిని పెళ్లి చేసుకొని ఉంటుంది. అంతే కాకుండా జూలియట్ ఒక పెద్ద ఆపదలో ఉంటుంది. పగ తీర్చుకోవాలని జైలు నుంచి బైటికొచ్చిన హరి నిజంగా పగ తీర్చుకున్నాడా? లేక జూలియట్ గురించి అసలు నిజం తెలుసుకున్నాడా? చివరికి ఏమైంది అనేది మిగతా కథ.

సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా జైలు నుంచి తప్పించుకోవడం, హీరో బ్యాక్ స్టోరీని రివీల్ చేయడంతో ఆసక్తికరంగానే సాగుతుంది. అయితే సెకండ్ హాఫ్ లో కథనం నెమ్మదించడం సినిమాకి మైనస్. క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ టర్న్ కొంతమేరకు ఈ మైనస్ లను కవర్ చేసినా ప్రేక్షకులకు అద్భుతమైన సినిమా చూశామనే తృప్తిని మాత్రం ఇవ్వలేకపోయింది. కథ కంటే ఎక్కువగా స్పీడ్ ఎడిటింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ తో సినిమాను నడిపించే ప్రయత్నం జరిగింది. దీనివల్ల ప్రేక్షకులు కొంతమేరకు ఎంగేజ్ అయినప్పటికీ సినిమా అంతా అయిపోయిన తర్వాత చూసుకుంటే మాత్రం ఓస్ ఇంతేనా అనే నిట్టూర్పు కలగక మానదు. నిజానికి ఈ సినిమా లవ్, క్రైమ్ ఆనే రెండు జోనర్లు మిక్స్ చేసి థ్రిల్లర్ గా ప్రెజెంట్ చేసిన కిచిడీ ఆనే చెప్పాలి. కొన్ని ఎపిసోడ్స్ లో, ముఖ్యంగా దోపిడీ ఎపిసోడ్స్, క్లైమాక్స్ లో సినిమాటిక్ లిబర్టీ ఎక్కువే తీసుకున్నారు. అలా అని సినిమా నీరసంగా ఉందా అంటే అదేమీ లేదు కానీ అడివి శేష్ సినిమా నుంచి అద్భుతం ఆశించే వారికి మాత్రం నిరుత్సాహం తప్పదు.

అడివి శేష్ సినిమాలంటే సహజంగా స్క్రీన్‌ప్లేలో మ్యాజిక్ తో చివరివరకూ ప్రేక్షకులను ఊపిరి బిగబట్టేలా చేసేవే. ఈ సినిమాను కూడా దర్శకుడు షానీల్ దేవ్ టెక్నికల్ గా సినిమాను చాలా హై స్టాండర్డ్స్ లో ప్రజెంట్ చేశాడు. సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. రైటింగ్ విషయానికి వస్తే కథ గొప్పగా లేనప్పటికీ స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేయాలని చేసిన ప్రయత్నం కొంతమేరకే సఫలం అయింది. డైలాగ్స్ మాత్రం క్రిస్ప్ గా ట్రెండీగా ఉన్నాయి. పాటలు యావరేజ్ గానే ఉన్నాయి కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా సీన్స్ ను ఎలివేట్ చేసింది. దానికి తగ్గట్టుగా సినిమాటోగ్రఫీ, స్పీడ్ ఎడిటింగ్ సినిమాకు ట్రెండీనెస్ తీసుకొచ్చాయి.

నటీనటుల విషయానికి వస్తే హరిదాస్ పాత్రలో అడివి శేష్ సులువుగానే చేసుకుంటూ పోయాడు. రాయలసీమ యాస కొంతవరకూ నప్పింది కానీ పూర్తి మార్కులు అయితే వెయ్యలేం. యాక్షన్ సీన్స్ లో మాత్రం చెలరేగిపోయాడు.. ఇక మృణాల్ ఠాకూర్ తన నటనతో ఆకట్టుకుంది. నటుడిగా మారిన బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ పోలీస్ ఆఫీసర్‌గా తనదైన ముద్ర వేయగా, ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు.

సినిమాలో బాగోలేనివి ఇవీ..

1. వీక్ అయిన సెకండ్ హాఫ్

2. దోపిడీల విషయంలో ఎక్కువైన సినిమాటిక్ లిబర్టీ

ఇందులో ఏం బాగున్నాయో తెలుసా?

1. అడివి శేష్, మృణాల్ ఠాకూర్, అనురాగ్ కశ్యప్ ల పర్ఫార్మెన్స్

2. యాక్షన్ ఎపిసోడ్స్

3. నేపథ్య సంగీతం

రేటింగ్: 2.5/5

ఫైనల్ వర్డ్: ప్రేమ ఎక్కువైంది.. థ్రిల్ తగ్గింది!

Dacoit Trailer (Telugu) | Adivi Sesh | Mrunal Thakur | Anurag Kashyap | Shaneil | Apr 10 In Theaters

Ramu Kovuru
Ramu Kovuruhttps://oktelugu.com/
Ramu Kovuru is a writer having 10 plus years of experience. He has worked for websites writing movies content. He is also woriking in Telugu film industry as a writer for the past 5 years. He has good knowledge in cinema across the languages. He contributes to movie reviews.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version