Shah Rukh Khan and Sukumar : ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీ పాన్ ఇండియాలో నెంబర్ వన్ ఇండస్ట్రీ గా కొనసాగుతుంది. మన దర్శకులందరు మంచి కాన్సెప్ట్ తో సినిమాలను చేస్తూ పాన్ ఇండియాలో భారీ విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే…ఇక అదే వైఖరిని ఇప్పుడు కూడా పాటిస్తూ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థాయి ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే ప్రయత్నమైతే చేస్తున్నారు…
Also Read : పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ పేర్లను మర్చిపోయిన షారుఖ్ ఖాన్..మండిపడుతున్న అభిమానులు..అసలు ఏమైందంటే!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంటిలిజెంట్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్(Sukumar)…ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తూ వస్తున్నాయి. బాలీవుడ్ ప్రేక్షకులు సైతం అతని సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పటికే ఆయన ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించాడు. 1850 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఎదగడమే కాకుండా తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకున్నాడు. మరి ఇలాంటి సుకుమార్ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని బ్రేక్ చేసే విధంగా మరికొన్ని సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. అయితే ఈ సినిమాలో ఆయన షారుఖాన్ ని విలన్ గా తీసుకోవాలని ప్రయత్నంలో ఉన్నాడట. మరి షారుక్ ఖాన్ కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక కథలో చాలా వైవిధ్యం ఉందని అందువల్లే షారుక్ ఖాన్ ఈ సినిమాకి కమిట్ అయ్యాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం బ్రేక్ అయ్యే విధంగా సినిమాలు చేయాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్న సుకుమార్ మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టిస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక షారుక్ ఖాన్ హీరోగా మాత్రమే సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. వాడితో భారీ పెను ప్రభంజనాలను సృష్టిస్తున్నాడు. మరి ఇలాంటి సందర్భంలో రామ్ చరణ్ సినిమాలో తను విలన్ గా నటిస్తే ఆయన మార్కెట్ పడిపోయే అవకాశం ఉందా? అనే ధోరణి లో కొంతమంది సినిమా పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న ప్రతి ఒక్క దర్శకుడు సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నారు. కానీ సుకుమార్ వాళ్లందరి కంటే భిన్నంగా ఆలోచిస్తూ సినిమాలను సక్సెస్ తీరాలకు చేర్చడంలో చాలావరకు ముందు వరుసలో ఉంటాడనే చెప్పాలి…ఇక ఏది ఏమైనా ఈ సినిమాలతో సుకుమార్ మరోసారి తన కంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
Also Read : వైసీపీ పార్టీ కి మద్దతుగా డైరెక్టర్ సుకుమార్..? ఊహించని ఫంక్షన్ లో అతిథిగా హాజరయ్యాడుగా!