Jawan: సూపర్ హిట్ సినిమా పఠాన్ తర్వాత మరోసారి బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ లీడ్ రోల్ లో మన ముందుకు రానున్న సినిమా జవాన్. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన జవాన్ సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ అవుతుంది. బాలీవుడ్ స్టార్ తో తమిళ స్టార్ డైరెక్టర్ కాంబో ఈ సినిమాపై అంచనాలు పెంచేలా చేసింది. కాగా ఈ సినిమాపై హిందీ, ఇక తమిళ వారికే కాదు…తెలుగు వారికి కూడా భారీ అంచనాలు ఉన్నాయి అని ఈ సినిమా ప్రీ బుకింగ్ చూస్తే అర్థమవుతుంది.
రిలీజ్ ఇంకా వారం రోజులు ఉంది అనగానే అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేశారు. ఈ అడ్వాన్స్ బుకింగ్స్ లో షారుఖ్ జవాన్ దూకుడు చూపిస్తొంది. ఈ సినిమా తెలుగు వర్షన్ కి తెలుగు రాష్ట్రాలలో బుకింగ్స్ సూపర్ గా ఉండడం అందరిని ఆశ్చర్యపరిస్తోంది.
ఈ చిత్రానికి హైదరాబాద్‌లో, తిరుపతిలో అభిమానులు పొటెత్తుతున్నారు. ఇప్పటికే 75 శాతం అక్యుపెన్సీ నమోదైంది. కాగా ఈ రెండు ప్రదేశాలలోనే కాదు తెలుగు రాష్ట్రాలలోని ఎన్నో ప్రదేశాలలో టికెట్లు ఓపెన్ అవ్వగానే ఈ చిత్రానికి దాదాపు బుక్ అయిపోయాయి. బాలీవుడ్ సినిమాలలో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలలో అత్యంత ప్రీ బుకింగ్స్ సాధించిన హిందీ సినిమాగా మిగిలనుంది.
అంతేకాదు ఇప్పటికే నార్త్ ఇండియా, ఓవర్సీస్ లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లో జరిగాయి. ఇక ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ జవాన్ రికార్డ్ ఓపెనింగ్స్ ని సాధించడం ఈ సినిమాపై ప్రేక్షకులకు ఉన్న అంచనాలను చెప్పకనే చెబుతోంది.
ఇక ఈ చిత్రంలో షారుక్ సరసన నయనతార హీరోయిన్గా నటిస్తుండగా, కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి విలన్ గా కనిపించనున్నాడు. ఇక అనిరుద్ రవిచంద్రన్ సంగీతమందిస్తున్న ఈ సినిమా డిజిటల్, సాటిలైట్ మరియు మ్యూజిక్ రైట్స్ తో సహా రూ.250 కోట్ల బిజినెస్ చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.కాబట్టి ‘జవాన్’ సినిమాకి మొదటి రోజు పాజిటివ్ టాక్ వస్తే కచ్చితంగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అన్నడంలో సందేహం లేదు.